Sania Mirza Trolls: మోదీ గారూ.. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయండి!

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన సానియా మీర్జా పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా నిలిచింది. తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసే పాకిస్థాన్ టీమ్ బయోబబుల్‌లో ఉన్న సానియా మీర్జా.. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించే వరకు హోటల్ గదులకే పరిమితమైంది. కానీ ఎప్పుడైతే భారత్ నిష్క్రమణ ఖారారయందో ఆమెకు రెక్కలొచ్చాయి. తన భర్త షోయబ్ మాలిక్‌ను సపోర్ట్ చేస్తూ గ్యాలరీలో సందడి చేసింది. ముఖ్యంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు హాజరైన ఆమె పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపింది.
సానియా సందడి..
ఈ క్రమంలో గురువారం జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా హాజరైన సానియా.. గ్యాలరీలో సందడి చేసింది. పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. అయితే ఇలా పాకిస్థాన్ జట్టుకు సానియా సపోర్ట్ చేయడాన్ని కొందరు భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడులతో భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్థాన్‌కు అండగా నిలిచిన సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. అంతేగాకుండా ఆమెపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మోదీ గారూ.. రద్దు చేయండి..
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ టీచర్ పాకిస్థాన్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుందని చర్యలు తీసుకున్నప్పుడు.. సానియా మీర్జా ఏకంగా పాక్ మద్దుత తెలిపిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పాక్‌కు మద్దతు తెలపడం ఏ మాత్రం భావ్యం కాదంటున్నారు. కొందరు మాత్రం సానియా మీర్జా మద్దతు ఇస్తుంటే చూడలేకనే పాక్ పతనాన్ని కోరుకున్నానని, అదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ఏ రోజు భారత జట్టుకు మద్దతు తెలపని సానియా మీర్జా.. ఇప్పుడు పాక్‌కు మద్దతు తెలపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సానియాకు కొత్తేం కాదు..
ఇక సానియా మీర్జాకు ఈ తరహా ట్రోలింగ్ ఎదుర్కొవడం కొత్తేం కాదు. భారత్-పాక్ మ్యాచ్ జరిగిన ప్రతీసారి ఆమెకు సోషల్ మీడియాలో ఇదే సమస్య ఎదురవుతోంది. ఈ క్రమంలో ఈ సారి ఆ బాధను తప్పించుకునేందుకు సానియా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఈ మ్యాచ్‌కు ముందే ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఏడు సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో సానియా ఉన్నట్టుండి మాయమవుతుంది. ఆ వీడియోలో ఓ పోస్ట్ కూడా ఉంచింది. 'భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రోజున చెడు వాతావరణం నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా' అని వీడియోపై కాప్షన్‌గా రాసింది. అంతేకాదు అలిగినట్టుగా, నవ్వుతున్నట్టుగా ఉన్న రెండు ఎమోజీలను కూడా పోస్ట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications