థూ.. ఒక టీవీ షో కోసం విడాకుల నాటకం ఆడుతారా? సానియా-మాలిక్ జోడీపై ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు జరిగిన ప్రచారం అంత ఉత్తదేనని తేలింది. ఓ టీవీ టాక్ షో ప్రమోషన్స్ కోసం ఈ జోడీ ఈ విడాకుల నాటకం ఆడినట్లు స్పష్టమైంది. ఇక షోయబ్ మాలిక్ పాకిస్థాన్ మోడల్ అయేషా ఒమర్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఇది తెలిసి సానియా మీర్జా విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఏ మాత్రం ఖండించని సానియా-షోయబ్ వాటికి బలం చేకూర్చేలా సెటైరికల్ ట్వీట్స్ చేశారు.
దొంగ నాటకాలు..
ముఖ్యంగా సానియా తన కొడుకు ఇజాన్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి'కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు'అంటూ క్యాప్షన్‌గా పేర్కొంది. ఆ తర్వాత 'ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది'అని మరో పోస్ట్ పెట్టింది. ఈ రెండు పోస్ట్‌లు సానియా బాధలో ఉన్న విషయాన్ని తెలియజేయగా.. అప్పుడే మాలిక్‌తో విడాకులనే పుకార్లు వెలువడ్డాయి. దాంతో జనాలంతా ఇది నిజమేనని నమ్మారు. షోయబ్ మాలిక్‌పై దుమ్మెత్తిపోసారు. బంగారం లాంటి పెళ్లాన్ని ఇంట్లో ఉంచుకొని పరాయి స్ట్రీ మోజులో పడటం ఏంటని మాలిక్‌కు చివాట్లు పెట్టారు.
ది మీర్జా మాలిక్ షో కోసం..
'సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు. సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తియిపోయాయి.' అంటూ మాలిక్ మేనేజర్ కామెంట్ చేశాడంటూ వార్త కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా ఉర్దూ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి నిర్వహించబోతున్న టీవీ టాక్ షోకు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది. ఈ ప్రోగ్రామ్‌కు 'ది మీర్జా మాలిక్ షో' అని పేరు పెట్టినట్లు ఈ పోస్టర్ ద్వారా తెలిసింది. ఈ పోస్టర్ చూసిన అభిమానులకు సానియా-మాలిక్‌ల నాటకం అర్థమైంది.

ఇంత దిగజారుతారా?
ఈ టాక్ షోకి పాపులారిటీ, క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్ పుట్టించారే విషయం బోధపడింది. ఈ రూమర్స్ అన్నీ ఈ టాక్ షోకి క్రేజ్ తెచ్చేందుకు చేసిన మార్కెటింగ్ ఎత్తుగడగా తేలింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నెటిజన్లు సానియా జోడీపై మండిపడుతున్నారు. ఓ టీవీ షో కోసం ఇంత దిగజారాలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ బెడిసి కొడుతదని, ఆ షోను ఎవరూ చూడరని శాపనార్దాలు పెడుతున్నారు.

పాపం అయేషా ఒమర్
మీ స్వార్థం వల్ల అభం శుభం తెలియని అయేషా ఒమర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొందని, ఆమె క్యారక్టర్ బ్యాడ్ అయిందని మండిపడుతున్నారు. ఇది ఏ మాత్రం సహించే విషయం కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. సరిహద్దులు ధాటి ప్రేమించుకున్న సానియా-మాలిక్ 2010లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజాన్ మీర్జా జన్మించాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు టెన్నిస్‌కి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, కొడుకుతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మాలిక్‌ను చేసుకోవడం వల్ల సానియా.. చాలా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్‌ల సందర్భంగా నెటిజన్లు సానియానే టార్గెట్ చేసేవారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications