
కమ్యూనికేషన్ గ్యాప్..
కోహ్లీ సంచలన ప్రకటన నేపథ్యంలో అందుకు గల కారణాలపై విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ పాటిల్ సైతం తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. 'ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐకి మధ్య చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతోనే కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చనే అనుమానం కలుగుతోంది. కోహ్లీ ఒకటి చెబితే, బీసీసీఐ మరొకటి చెబుతుందని అనుకోలేం.

బ్యాటింగ్ మెరుగవుతుంది..
ఈ నిర్ణయం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే కావచ్చు. ఏదిఏమైనప్పటికీ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతని బ్యాటింగ్‌ను మెరుగయ్యేందుకు సహకరిస్తుంది. భారత క్రికెట్‌కు కోహ్లి గొప్ప ఆస్తి. అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి ప్రపంచకప్ గెలుస్తుంది. విరాట్ టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినా.. దేశం తరఫున పరుగులు చేస్తూనే ఉండాలి. కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేందుకు రోహిత్ శర్మకు మించిన అర్హుడు మరొకరు లేరు'అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చారు.

ఆల్‌రౌండర్‌గా..
కాగా, 1983 భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పాటిల్ 2012-16 మధ్యలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వ్యవహరించాడు. 80ల్లో భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న పాటిల్.. రిటైర్మెంట్ అనంతరం కెన్యా జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో కెన్యా 2003 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించింది. 1980-86 మధ్య భారత జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాటిల్.. 29 టెస్ట్‌లు, 45 వన్డేల్లో 2500లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లలో కలపి అతను 24 వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్‌గా రోహిత్ అర్హుడు:
ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్‌గా అర్హుడని మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ అర్హుడు. ఎందుకంటే అతడికి అవకాశం ఇచ్చినప్పుడల్లా కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. 2018లో అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జట్టును కూడా అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. టీ20 కెప్టెన్‌గా లోకేష్ రాహుల్ పేరు కూడా వినబడుతోంది. అయితే ఇప్పుడే అతడికి కెప్టెన్సీ ఇవ్వడం తొందరపాటు అవుతుంది' అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












