Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలు సమస్య వదిలేసి గంభీర్‌ను బద్నాం చేయడం సరికాదు: మాజీ చీఫ్ సెలెక్టర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ అండగా నిలిచాడు. జట్టు అసలు సమస్య వదిలేసి అతనొక్కిడిని విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంది. వైట్‌బాల్ సిరీస్‌లో రెండు ఐసీసీ టోర్నీలు గెలిచినా.. టెస్ట్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

గంభీర్‌కు బదులుగా వారిని ఎందుకు బలిపశువులను చేశారు?: మాజీ క్రికెటర్

గంభీర్‌కు బదులుగా వారిని ఎందుకు బలిపశువులను చేశారు?: మాజీ క్రికెటర్

సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయ్యింది. తాజా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 సైకిల్‌లో 9 టెస్ట్‌లు ఆడి నాలుగింటిలో ఓడి ఐదో స్థానంలో కొనసాగుతోంది. గంభీర్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే భారత్ ఘోర పరాజయాలు మూటగట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి.

Sandeep Patil and Lalchand Rajput Back Gautam Gambhir Say It s Wrong to Blame One Person for Test Slump

గంభీర్‌ను ఒక్కడినే నిందించడం సరికాదు..

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ గంభీర్‌కు అగ్నీ పరీక్షగా మారింది. ఒకవేళ ఈ సిరీస్ కూడా కోల్పోతే గంభీర్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్‌‌ను సందీప్ పాటిల్ వెనకేసుకొచ్చాడు. జట్టు వైఫల్యాన్ని ఒక్క వ్యక్తిపై మోపడం సరికాదన్నాడు. 'శ్రీలంక పర్యటన గంభీర్‌తో పాటు అందరికీ కీలకం.

కేవలం గంభీర్‌నే ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతను మంచి ఫలితాలు తీసుకురావడంలో విఫలమైతే ఆటగాళ్లు కూడా విఫలమైనట్లే కదా. గంభీర్ ఒక్కడినే విమర్శించడం సరికాదు. మన ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయాడు. దాంతోనే న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై సిరీస్ కోల్పోయారు.

అంతేకాకుండా న్యూజిలాండ్ ఆటగాళ్ల మంచి సన్నద్ధతో ఇక్కడికి వచ్చారు. వారు స్పిన్‌కు అనుకూలమైన వికెట్లపై ప్రాక్టీస్ చేశారు. భారత జట్టు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే వికెట్లపై సన్నహకాలు చేసింది. అదే భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. అందుకే ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.'అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్, శ్రేయస్ అయ్యర్‌‌లకు చెక్!

Also Read

టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్, శ్రేయస్ అయ్యర్‌‌లకు చెక్!

కాస్త సమయం ఇవ్వాలి..

టీమిండియా మాజీ కోచ్‌ అయిన లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా గంభీర్‌కు అండగా నిలిచాడు. కోచ్ అన్నాక ఒడుదొడుకులు సహజమని, ప్రతీసారి విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. 'ప్రస్తుతం భారత జట్టు పరివర్తన దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు, కోచ్‌కు తగినంత సమయం ఇవ్వాలి. రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం కూడా టీమిండియాపై ప్రభావం చూపిస్తోంది. 'అని లాల్‌చంద్ చెప్పుకొచ్చాడు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ మొదలవ్వనుంది. ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరుకుంది.

Story first published: Wednesday, August 5, 2026, 19:25 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+