Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీలో నాకు నచ్చేది అదే: సమంత

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జల్లు కురిపించింది. మహేంద్ర సింగ్ ధోనీ పర్ఫెక్షనిస్ట్ అని, అంత ప్రశాంతంగా ఎలా ఉంటాడో అర్థం కాదని పేర్కొంది. తన చుట్టూ ఏం జరిగినా కూల్‌గా కనిపిస్తాడని తెలిపింది.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర్ కొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఖుషి'. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌ను అప్పుడే మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

Samantha Comments On MS Dhoni

అందులో భాగంగా సమంత-విజయ్ దేవర కొండ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా సమంత్-విజయ్ దేవరకొండ చిట్ చాట్‌కు సంబంధించిన వీడియోను ప్లే చేశారు. అంతకు ముందు విడుదల చేసిన ప్రొమోలో.. సీఎస్‌కే, ధోనీ గురించి అడగ్గా.. ఈ ఇద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ముందుగా సమంత మాట్లాడుతూ...'ధోనీ పర్ఫెక్షనిస్ట్. అంత కూల్‌గా ఎలా ఉంటాడో తెలియదు. ఏం జరిగినా.. అంతే కూల్‌గా కనిపిస్తాడు.'అని తెలిపింది. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ 'నా ఫేవరేట్ ప్లేయర్ ధోనీ. లాంగ్ హెయిర్‌తో, రైల్వే బ్యాక్‌గ్రౌండ్‌తో రాంచీ నుంచి వచ్చి భారత కెప్టెన్‌గా ఎదగడం గొప్ప విషయం. కెరీర్ ప్రారంభంలో ప్రతీ బంతిని స్టేడియం అవతలికి కొట్టేవాడు.'అని తెలిపాడు.

ఆ తర్వాత ఇద్దరూ చెన్నై స్లోగన్ విజిల్ పోడు అంటూ విజిల్ వేసారు. ఇదే చిట్‌చాట్‌లో భారత ప్లేయర్ల బ్యాటింగ్ స్టైల్ బట్టి వారి పేర్లను చెప్పారు. సచిన్ బ్యాటింగ్ స్టైల్‌ను సమంత ఇమిటేట్ చేయగా.. ధోనీ హెలికాప్టర్ షాట్‌ను దేవరకొండ ఇమిటేట్ చేశాడు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలని తాను కోరుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. సన్‌రైజర్స్ చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. ప్లే ఆఫ్స్ దూసుకెళ్లాలని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.. ప్రస్తుతం ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Story first published: Thursday, May 11, 2023, 16:33 [IST]
Other articles published on May 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+