Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన సామ్ కోన్‌స్టాస్!

ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సామ్ కోన్‌స్టాస్.. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సామ్ కోన్‌స్టాస్.. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏమాత్రం బెరుకు లేకుండా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Sam Konstas Creates History Becomes First Player In World To Became The Youngest To Score a Test fifty on debut vs India

19 ఏళ్ల 85 రోజుల వయసులో కోన్‌స్టాస్ ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ సాధించాడు. ఇయాన్ క్రైగ్ 17 ఏళ్ల 240 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ సాధించి ఆసీస్ అతి పిన్నవయస్కుడిగా కొనసాగుతున్నాడు. భారత్‌పై అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ బాదిన పిన్న వయస్కుడిగా సామ్ కోన్‌స్టాస్ నిలిచాడు. పాకిస్థాన్ బ్యాటర్లు ముస్తాక్ మహమ్మద్, షాహిద్ అఫ్రిది మాత్రమే భారత్‌పై అరంగేట్ర మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయితే 20 ఏళ్ల లోపు వయసులోనే భారత్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా సామ్ కోన్‌స్టాస్ నిలిచాడు.

నాథన్ మెక్‌స్వీని స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్ కోన్‌స్టాస్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. సామ్ కోన్‌స్టాస్ శుభారంభంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అతను ఔటయ్యే సమయానికి ఆసీస్ 66.3 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(0)తో పాటు స్టీవ్ స్మిత్(45 బ్యాటింగ్) ఉన్నాడు.

Story first published: Thursday, December 26, 2024, 11:28 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+