Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను అది అస్సలు ఊహించలేదు.. ధోనీ నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయా: సామ్

Sam Curran surprised by MS Dhoni’s decision to promote him in batting order

అబుదాబి: గతేడాది ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో కంగుతిన్న చెన్నై సూపర్‌ కింగ్స్.. ఈ సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాకిస్తూ టోర్నీలో శుభారంభం చేసింది. శనివారం అబుదాబిలో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్‌ 2020 తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్‌ (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4) మెరుపులతో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు

లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను తన కంటే ముందు పంపించాడు. కీలక సమయంలో ఇద్దరూ బ్యాట్ జులిపించారు. జడేజా ఐదు బంతుల్లో 2 బౌండరీల సాయంతో 10 పరుగులు చేశాడు. ఇక కరన్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బౌలింగ్‌లో ఒక వికెట్‌.. తర్వాత బ్యాటింగ్‌లో 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి చెన్నై గెలుపుకు మార్గం సుగమం చేశాడు. కీలక సమయంలో కరన్ రెండు సిక్సులు, ఒక ఫోర్ బాది డుప్లెసిస్‌పై భారం తగ్గించాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై కరన్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాననుకోలేదు

ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాననుకోలేదు

'చెన్నై జట్టుతో కలుస్తున్నాననే ఆలోచన నాలో కొత్త ఉత్సాహం నింపింది. చెన్నైకు మ్యాచ్ ఆడినా.. ఆ జట్టులోని ఆటగాళ్లతో పెద్దగా కలవలేదు. ఎందుకంటే నేను ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన రెండు రోజుల్లోనే దుబాయ్‌కు చేరుకున్నా. క్వారంటైన్ గడిపా. నేరుగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాను. నిజం చెప్పాలంటే.. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని అప్పటివరకు తెలియదు. కెప్టెన్‌ ధోనీ నా వద్దకు వచ్చి.. జడేజా తర్వాత నువ్వే బ్యాటింగ్ చేయాలి. రెడీగా ఉండు అని చెప్పాడు. నేను అది అస్సలు ఊహించలేదు. మహీ నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయా' అని కరన్ చెప్పాడు.

 ధోనీ ఓ జీనియస్

ధోనీ ఓ జీనియస్

'నిజంగా ఎంఎస్ ధోనీ ఓ జీనియస్‌. లెఫ్ట్‌.. రైట్‌ కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకొనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇక 18వ ఓవర్‌కు ముందు నా వద్దకు వచ్చిన ధోనీ ఓ విషయం చెప్పాడు. "రిస్క్‌ తీసుకొని ఆడు.. ఏదైతే అది జరుగుతుంది. నీ ఆట నువ్వు ఆడు. మనకు పరుగులు కావాలి" అని చెప్పాడు. కృనాల్‌ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషంగా ఉంది. రాయుడు, డుప్లెసిస్‌లు అద్భుతంగా ఆడారు. జట్టు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది' అని ఇంగ్లీష్ పేసర్ సామ్ కరన్ పేర్కొన్నాడు.

అందుకే ప్రమోషన్‌ ఇచ్చా

అందుకే ప్రమోషన్‌ ఇచ్చా

మ్యాచ్‌ ముగిసిన తర్వాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'జడేజా, కరన్‌లను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాకంటే ముందు పంపించడంలో ఎలాంటి ఆలోచన లేదు. ఇద్దరు మంచి ఆల్‌రౌండర్లు. హిట్టింగ్‌ ఆడే అవకాశం ఉండడం.. కీలక సమయంలో సిక్స్‌లు బాది జట్టుకు ఒత్తిడి తగ్గిస్తారనే ప్రమోషన్‌ ఇచ్చా' అని స్పష్టం చేశాడు. చెన్నై తన తరువాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 22న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

సచిన్‌కు ముంబై, కోల్‌కతా మాత్రమే.. ధోనీ కోసం పూర్తి దేశం ఉంది: గవాస్కర్‌

Story first published: Sunday, September 20, 2020, 10:51 [IST]
Other articles published on Sep 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+