క్వారంటైన్ కలకలం.. గడువు పూర్తవ్వకముందే జట్టుతో కలిసిన సామ్ కరన్?!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో క్వారంటైన్ కలకలం తలెత్తిందని వార్తలు వస్తున్నాయి. క్వారంటైన్ గడువు విషయంలో కొన్ని ఫ్రాంచైజీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై గుర్రుగా ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని ప్రాంచైజీల పట్ల బీసీసీఐ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని జట్ల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. 36 గంటల క్వారంటైన్ గడువు ముగియకుండానే ఇద్దరు ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చేరారని అంటున్నాయి. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి.

మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రయాణం
ఐపీఎల్ 2020 తొలి పోరులో అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడ్డాయి. భారత్ నుంచి యూఏఈ వెళ్లిన ముంబై అబుదాబిలో బస చేస్తుండగా.. చెన్నై దుబాయ్‌లో ఉంటోంది. మ్యాచ్ ఆడేందుకు చెన్నై దుబాయ్ నుంచి బస్‌లో రెండు గంటలు ప్రయాణించి అబుదాబికి చేరుకుంది. ఆ బస్సులో సామ్ కరన్, జోస్ హేజిల్‌వుడ్ కూడా మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రయాణించారట. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. వారు క్వారంటైన్ గడువు పూర్తి చేయలేదని సమాచారం.

కోటి రూపాయలు ఖర్చుచేసి
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీసులో ఆడిన 21 మంది ఆటగాళ్లను ఏడు ఫ్రాంచైజీలు (ముంబై మినహా) కోటి రూపాయలు ఖర్చుచేసి ఒకే విమానంలో దుబాయ్‌కి తీసుకొచ్చాయి. వీరికి బీసీసీఐ 36 గంటల క్వారంటైన్ విధించింది. దీంతో అన్ని జట్లలో ఉన్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే చెన్నై జట్టులోని వారు ఆ గడువు ముగియకముందే ఆటగాళ్లతో కలిశారని వార్తలు వస్తున్నాయి.

నాలుగు గంటలు ముందుగానే రిపోర్టు
అబుదాబి కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్వారంటైన్ ముగుస్తుంది. కానీ సామ్ కరన్, జోస్ హేజిల్‌వుడ్ నాలుగు గంటలు ముందుగానే రిపోర్టు చేశారు. అంటే వారు 36 గంటల క్వారంటైన్‌లో లేనట్టేనని కొన్ని ఫ్రాంచైజీలు ఆరోపిస్తున్నాయి. ఆ రెండు గంటల్లో కరోనా లక్షణాలు కనిపించి, ఇతరులకు సోకితే పరిస్థితి ఏంటని గుర్రుగా ఉన్నాయి. వారు జట్టు సభ్యులతో చేరారంటే బీసీసీఐ వీరికి అనుకూలంగా వ్యవహరించిందని ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు స్పష్టంగా తెలుస్తోందని కొన్ని ఫ్రాంఛైజీలు వాపోతున్నాయి. నిబంధనలు కఠినంగా పాటించాలని చెబుతున్న బీసీసీఐ.. చెన్నై విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహించిందని వారు ప్రశ్నిస్తున్నారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించరాదని చెప్పి
క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మెగా టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నారు. టోర్నీకి ముందు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచారు. మైదానంలోకి అడుగుపెట్టకుముందు బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహించాలని డిసైడ్ అయిన నాటి నుంచి ఆయా జట్ల ఫ్రాంచైజీలను బీసీసీఐ హెచ్చరిస్తూ వచ్చింది. భారత్‌లోనే కాకుండా యూఏఈలో కూడా కోవిడ్ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించరాదని ఫ్రాంఛైజీలకు స్పష్టం చేసింది బీసీసీఐ. ఆలా చెప్పిన బీసీసీఐనే ఇలా నిర్లక్ష్యం వహించడం ఏంటని అందరూ మండిపడుతున్నారు.
పడిక్కల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశా.. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆటతీరును ఆస్వాదించా: గంగూలీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications