For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క సెంచరీ చేయని మైకేల్ వాన్‌కు కోహ్లీ గురించి మాట్లాడే అర్హత లేదు: పాక్ క్రికెటర్

Salman Butt says Virat Kohli has 70 international tons, Michael Vaughan has none in ODIs
Vaughan ఫైర్.. నీలా స్పాట్ ఫిక్సింగ్ చేయలేదు | Kohli గురించి మాటల యుద్ధం || Oneindia Telugu

ఇస్లామాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కవ చేస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ గురించి వన్డే క్రికెట్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని మైకేల్ వాన్ మాట్లాడటం అర్హరహితమన్నాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో పోల్చుతూ మైకేల్ వాన్‌ సరికొత్త చర్చకు తెరలేపాడు. విలియమ్సన్‌ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లీని వెనక్కు నెట్టి వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా నిలిచేవాడన్నాడు. ఇక్కడ విలియమ్సన్ కన్నా విరాట్ కోహ్లీ తక్కువా అనే ఉద్దశేంతో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన సల్మాన్ బట్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌పై మండిపడ్డాడు.

పోలికే అనవసరం..

పోలికే అనవసరం..

వన్డే ఫార్మాట్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్‌ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు. 86 వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక్క శతకం కూడా నమోదు చేయలేని ఆటగాడు చర్చల్లో పాల్గొనేందుకు అనర్హుడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌, పాంటింగ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లీని ఇతర క్రికెటర్లతో పోల్చడాన్ని పాక్ వెటరన్ ఓపెనర్ తప్పుబట్టాడు.

కోహ్లీని మించిన ఆటగాడు లేడు..

కోహ్లీని మించిన ఆటగాడు లేడు..

'అధిక జనాభ గల దేశానికి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతని టాప్ పెర్ఫామెన్స్‌తో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే అతను 70 సెంచరీలు నమోదు చేశాడు. ఈ తరంలో మరే ఆటగాడు కూడా విరాట్‌లా ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతేకాకుండా సుదీర్ఘకాలం అతను తన సూపర్బ్ బ్యాటింగ్‌తో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. టాప్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లీకి మించిన ఆటగాడు లేడు. ఇందుకు అతని గణాంకాలే నిదర్శనం. రికార్డుల పరంగా చూసినా కోహ్లీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాంటప్పుడు అతన్ని సమకాలీకులతో పోల్చడం సమంజసం కాదు.

ఒక్క సెంచరీ లేదు..

ఒక్క సెంచరీ లేదు..

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన వాన్.. గొప్ప బ్యాట్స్‌మన్ అయితే కాదు. అతను మంచి టెస్ట్ బ్యాట్స్‌మన్ అయినప్పటికీ వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఓపెనర్‌ అయిన అతను కనీసం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తికి ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన కోహ్లీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇదంతా పనికి రాని చర్చ'అని సల్మాన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా సాధించని వాన్‌.. టెస్టుల్లో మాత్రం 18 శతకాలు నమోదు చేశాడు. 1999 నుంచి 2007 మధ్యకాలంలో అతను 82 టెస్టుల్లో 5719 పరుగులు సాధించాడు.

నీలా.. స్పాట్ ఫిక్సింగ్ చేయలేదు..

ఇక సల్మాన్ బట్ వ్యాఖ్యలపై మైకేల్ వాన్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. తాను ఒక సెంచరీ చేయకపోయినా.. ఫిక్సింగ్ మాత్రం చేయలేదని సల్మాన్ బట్‌ను విమర్శించాడు. ఆజ్‌తక్ బంగ్లా ట్విటర్ రియాక్షన్‌లో మైకేల్ వాన్ మాట్లాడుతూ.. 'ఆ హెడ్‌లైన్ గురించి ఐడియా లేదు. కానీ సల్మాన్ నా గురించి మాట్లాడాడు. అది ఒకే. అతని అభిప్రాయాన్ని చెప్పాడు. కానీ అతను 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినప్పుడు ఇలాంటి క్లియర్ మైండ్‌సెట్‌తో ఉంటే బాగుండేది.'అని వాన్ సెటైర్స్ పేల్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంతో ఐదేళ్ల నిషేదానికి గురైన సల్మాన్‌ బట్‌.. పాక్‌ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Sunday, May 16, 2021, 18:42 [IST]
Other articles published on May 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+