Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సోయి ఫిక్సింగ్ చేసినప్పుడుంటే బాగుండు! మైకేల్ వాన్‌కు మానసిక మలబద్దకం.. నెట్టింట మాటల యుద్దం!

Salman Butt responds to Michael Vaughans match-fixing jibe
Kohli-Williamson Comparison - Salman Butt Dig at Michael Vaughan | Oneindia Telugu

లండన్: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తోంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ భారత్​లో పుట్టుంటే కోహ్లీని మించి, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకునేవాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ బట్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని మైకేల్ వాన్‌కు కోహ్లీ గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు.

అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఇప్పటికే 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీని ఇతరులతో పోల్చడం అర్దరహితమన్నాడు. అత్యధిక జనాభాగల దేశానికి విరాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలని, తన సూపర్ పెర్ఫామెన్స్‌తో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడని బట్ చురకలంటించాడు.

మైకేల్ వాన్ పనికిరాని చర్చలకు తెరలేపుతున్నాడని విమర్శించాడు. ఇక సల్మాన్ బట్ వ్యాఖ్యలపై మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. సెంచరీ చేయకున్నా ఫిక్సింగ్ అయితే చేయలేదని, ఈ సోయి సల్మాన్ బట్‌కు అప్పడుంటే బాగుండేదని ట్విట్ చేశాడు. 'బట్ నాపై చేసిన వ్యాఖ్యలు విన్నా. తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ అతడికుంది. అయితే 2010లో మ్యాచ్ ఫిక్సింగ్​ విషయంలో కూడా అతనికి ఇంతే స్పష్టత ఉంటే బాగుండేది'అన్నాడు.

ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సల్మాన్ బట్.. మైకేల్ వాన్ మానసిక మలబద్దకంతో బాధపడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. అతను అసలు విషయాన్ని పక్కదారి పట్టించి మాట్లాడుతున్నాడని, మానసిక మలబద్దకంతో బాధపడే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బట్ పేర్కొన్నాడు. ఇద్దరు స్టార్ ప్లేయర్ల గురించి అనవసర చర్చను లేవనెత్తి.. అది తప్పని చెబితే పాత విషయాలను తవ్వతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వన్డే ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా సాధించని వాన్‌.. టెస్టుల్లో మాత్రం 18 శతకాలు నమోదు చేశాడు. 1999 నుంచి 2007 మధ్యకాలంలో అతను 82 టెస్టుల్లో 5719 పరుగులు సాధించాడు. 2010లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంతో ఐదేళ్ల నిషేదానికి గురైన సల్మాన్‌ బట్‌.. పాక్‌ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Monday, May 17, 2021, 12:23 [IST]
Other articles published on May 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+