For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మో.. ఆస్ట్రేలియా బౌలర్లు సుద్దపూసలంటే నేను నమ్మను: పాక్ క్రికెటర్

Salman Butt refuses to believe Australian bowlers after they claim innocence in ball tampering scandal
Ball-Tampering: డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతీ ఒక్కరి పాత్ర.. బంతితో రివర్స్ స్వింగ్ || Oneindia Telugu

కరాచీ: బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా బౌలర్లు అమయాకులంటే తాను ఏ మాత్రం నమ్మనని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. ఆ ఘటనలో డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతీ ఒక్కరి పాత్ర ఉంటుందని సందేహం వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రమేయం లేకుండా బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం అసాధ్యమన్నాడు.

2018లో జరిగిన ఈ బాల్‌ ట్యాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆస్ట్రేలియా ఓపెనర్, ఈ ఘటన ప్రధాన సూత్రదారి కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ ఇటీవల బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేపాయి. ఈ ఉదంతంపై పై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ ఘటనపై రీఇన్వెస్టిగేషన్‌కు తాము సిద్దమంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

అమయాకులమంటూ..

అమయాకులమంటూ..

అంతేకాకుండా ఆస్ట్రేలియా మీడియా బౌలర్లపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బౌలర్లంతా ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాండ్ పేపర్ గేట్ గురించి ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకుతో ఏదో సమాధానం చెప్పానని బెన్‌క్రాఫ్ట్ తమకు తెలియజేశాడని, కావాలని ఆ కామెంట్స్ చెయ్యలేదన్నాడని పేర్కొన్నారు. న్యూలాండ్స్ టెస్ట్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నామని బౌలర్లు ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.

బౌలర్లే కాదు డ్రెస్సింగ్ రూమ్ మొత్తం..

బౌలర్లే కాదు డ్రెస్సింగ్ రూమ్ మొత్తం..

ఈ ప్రకటనపై స్పందించిన సల్మాన్ బట్.. తన యూట్యాబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనలో బౌలర్లే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ మొత్తం పాత్ర ఉందన్నాడు. బౌలర్లు శిక్షపడకుండా తప్పించుకున్నారని అభిప్రాయపడ్డాడు. 'బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంలో బౌలర్ల పాత్ర లేదనడం ఏ మాత్రం నిజం కాదు. బౌలర్లకు తెలియకుండానే రివర్స్ స్వింగ్ కోసం బంతిని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారా? బంతిని పదే పదే రుద్దుతూ ఓ పాయింట్ రివర్స్ స్వింగ్ రాబట్టాలనే వ్యూహంతో అలా చేశారు. టీమ్‌, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వ్యక్తులకు తెలియకుండా మైదానంలోకి సాండ్ పేపర్ తీసుకెళ్లి ఇది చేయడం చాలా కష్టం.

వారెవ్వా.. బ్యాట్స్‌మెన్‌కు శిక్షలు..

వారెవ్వా.. బ్యాట్స్‌మెన్‌కు శిక్షలు..

బెన్‌క్రాఫ్ట్ బంతిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా దాన్ని ఆకారాన్ని దెబ్బతీశాడు. ఈ విషయం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌కు తెలుసు. ఈ ముగ్గురే దోషులగా తేలి శిక్షను కూడా అనుభవించారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ అనే విషయాన్ని గ్రహించాలి. బంతితో రివర్స్ స్వింగ్ చేసేదేమో బౌలర్లు. శిక్షలేమో బ్యాట్స్‌మెన్‌కు.. వారెవ్వా ఈ నిర్ణయాలు తీసుకున్నవారెవరో వారిని అభినందించాలి. ఒక్క బౌలర్‌కు కూడా శిక్ష పడలేదు. అసలు దోషులు తప్పించుకున్నారు. డ్రెస్సింగ్‌ రూంలో దీని గురించి చర్చ జరుగకుండానే ఇదంతా సాధ్యమైందంటే అస్సలు నమ్మను.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

కెమెరాలకు అడ్డంగా దొరికి..

కెమెరాలకు అడ్డంగా దొరికి..

న్యూల్యాండ్స్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి బెన్‌క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బెన్‌క్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను సీఏ జట్టు నుంచి తప్పించింది. బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. ట్యాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసన్న బెన్‌క్రాఫ్ట్ అంతలోనే మాట మార్చాడు. సాండ్ పేపర్ గేట్ ఘటన గురించి తన వద్ద కొత్త సమాచారం ఏం లేదని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాడు. విసిగించే ప్రశ్నలతోనే అలా చెప్పానని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 19, 2021, 13:09 [IST]
Other articles published on May 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+