రిషబ్ పంత్.. ఇలాగే ఆడితే ఇంగ్లండ్‌లో విజయవంతం అవ్వడం కష్టమే! ఇప్పటికైనా ఆ శైలి మార్చుకో: సల్మాన్

కరాచీ: టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇలాగే ఆడితే ఇంగ్లండ్‌లో విజయవంతం కాలేడని పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ అన్నాడు. కాస్తంత ఓపికతో ఆడాలన్నాడు. ఇప్పటికైనా వచ్చీరాగానే బౌలర్లపై ఎదురుదాడి చేయొద్దని సల్మాన్ సూచిందాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో పంత్ విఫలమయిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక సమయంలో క్రీజులోకి వచ్చి 2, 1 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ మాట్లాడుతూ పంత్ బ్యాటింగ్‌పై తన అభిప్రాయాలు వ్యక్తపరిచాడు.

మూడు టెస్టులు ఆడినా
రిషబ్ పంత్ ఈ ఏడాది టెస్టుల్లో విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నిరాశపరిచినా.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటన ద్వారా గాడిలో పడ్డాడు. ఆపై ఇంగ్లండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచులో కూడా రాణించాడు. ఐపీఎల్ 2021లో కూడా ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులు ఆడినా ఒక్కటీ పెద్ద స్కోర్ సాధించలేకపోయాడు. అయినా ఈ ఏడాది అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 43గా ఉండడం గమనార్హం. పంత్ ఇప్పటివరకు భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 33 టీ20లు ఆడాడు.

ఇలాంటి బ్యాటింగ్ అస్సలు పనికిరాదు
తాజాగా సల్మాన్ బట్ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ ఇలాగే ఆడితే టెస్టుల్లో విజయవంతం కాలేడు. అతడు కాస్తంత ఓపికతో ఆడాలి. దాంతో పాటు రక్షణాత్మక ధోరణి కూడా అలవర్చుకోవాలి. అతడి అమ్ములపొదిలో ఎన్నో వైవిధ్యమైన షాట్లు దాగున్నా డిఫెన్సివ్ మెకానిజం మాత్రం అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇంగ్లండ్ పిచ్‌లపై ఇలాంటి బ్యాటింగ్ అస్సలు పనికిరాదు. పంత్ భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో విజయవంతమైనా ఇక్కడ అది సాధ్యంకాదు.
ఎందుకంటే ఆయా దేశాల్లో బంతి అంతగా స్వింగ్ అవ్వదు. ఈ నేపథ్యంలో పంత్ ఇప్పుడు ఆడుతున్న ఆటతీరు బట్టి బంతి ఎక్కడైతే స్వింగ్ అవుతుందో, సీమ్‌కు అనుకూలిస్తోందో ఆ సవాళ్లను ఎదుర్కోలేడు' అని చెప్పాడు.
స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్‌లో నువ్ సాధించింది ఏం లేదు! కానీ అందమైన భార్యను మాత్రం పట్టావ్!!

ఈ సిరీస్ కఠినంగానే
భారత కీపర్ రిషబ్ పంత్ కాస్త ప్రశాంతంగా ఆడాలని, వచ్చీరాగానే బౌలర్లపై ఎదురుదాడి చేయొద్దని సల్మాన్ బట్ పలు సలహాలిచ్చాడు. అతడిలాగే ఆడితే తాత్కాలికంగా బతికిపోయినా దీర్ఘకాలంలో ప్రయోజనం ఉండదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో చెలరేగిన పంత్‌కు ఈ సిరీస్ మాత్రం చాలా కఠినంగానే ఉంది. పంత్ ఐదు ఇన్నింగ్స్‌లలో 87 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వరణుడి కారణంగా చివరి రోజు తుడిచిపెట్టుకుపోయింది. పంత్ ఇలానే విఫలమయితే.. సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రూట్ సేన.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications