
స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా మయంతి సెటైర్లు
అయితే స్టువర్ట్ బిన్నీ భార్య, స్టార్ కామెంటేటర్ మయంతి లాంగర్ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ.. వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా మయంతి సెటైర్లు వేసింది.
తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే.. అతనికి బౌలింగ్ చేయలేక అండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినా.. రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు.

అందమైన భార్యను మాత్రం పట్టావ్
తాను పోస్ట్ చేసిన స్టోరీలో మయంతి లాంగర్ ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో జేమ్స్ అండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా (స్టువర్ట్ బిన్నీ తప్ప) కాదని పరోక్షంగా భారత స్టార్ ఆటగాళ్లపై సెటైర్లు వేసింది. మూడో టెస్ట్ అనంతరం మయంతి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆ స్టోరీ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈరోజు స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతడితో పాటు మయంతిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 'స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్‌లో నువ్ సాధించింది ఏం లేదు. కానీ అందమైన భార్యను మాత్రం పట్టావ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇప్పటివరకు తన కెరీర్‌లో స్టువర్ట్ బిన్నీ సాధించింది మయంతిని మాత్రమే' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ప్రేమించి పెళ్లాడాడు
భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన స్టువర్ట్ బిన్నీ.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ (6/4) పేరిటే ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (6/12) రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌కు మయంతి దూరం
ఐపీఎల్ అంటే ఆటతో పాటు గ్లామర్ డోస్ కూడా ఉంటుంది. హాట్ హాట్ యాంకర్లు, చీర్స్ లీడర్స్ సందడి మొదటినుంచి ఉంది. కొంతమంది అభిమానులు కేవలం గ్లామర్ కోసమే అంటే ఇక్కడ యాంకర్ల కోసమే ఐపీఎల్ చూస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ అందమైన యాంకర్లను దింపుతోంది. అయితే కరోనా కారణంగా చీర్స్ లీడర్స్ టోర్నీకి దూరం కాగా.. ఐపీఎల్ 2020కి మయంతి లాంగర్ కూడా దూరమవడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఐపీఎల్ 2021కి ఆమె దూరంగానే ఉంది. వచ్చే ఏడాది అయినా అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications












