జట్టులోకి రాకుండా అఫ్రీదినే ఆపేశాడంటున్న పాక్ మాజీ కెప్టెన్

కరాచి: స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా శిక్షకు గురై తదనంతరం జట్టులోకి తీసుకోకపోవడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయిందంటున్నాడు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. పాకిస్థాన్ టీ20 జట్టులోకి తన పురాగమనాన్ని షాహిద్ అఫ్రీది అడ్డుకున్నాడని ఆయన ఆరోపించాడు. అతను 2010 స్పాట్ ఫిక్సింగ్ కేసులో అప్పటికే ఐదేళ్లపాటు నిషేదాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 2016 టీ20 ప్రపంచకప్ జట్టులోకి తనను ఎంపిక చేయకుండా అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అడ్డుకున్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆరోపించాడు.

అప్పటి జట్టు కెప్టెన్‌గా సల్మాన్ భట్
2010లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న సందర్భంగా అప్పటి జట్టు కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్లు మొహ్మద్ ఆసిఫ్, మొహ్మద్ అమెర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి దోషులుగా తేలారు. ఈ కారణంతోనే ఐదేళ్ల పాటు నిషేధానికి గురైయ్యాడు. అది పూర్తైన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ ఆడుతున్న సమయంలో 2016 టీ20 ప్రపంచకప్ ఆడే జట్టుకు దాదాపు చోటు ఖాయం అయిపోయింది. అప్పుడు టీ20 కెప్టెన్‌గా ఉన్న అఫ్రీది.. తన పునరాగమనాన్ని అడ్డుకున్నాడట.
'పార్టనర్ మారాడు.. పిచ్ మారింది.. రాహుల్ మారడా?'

అఫ్రిది అడ్డుపడడంతోనే చోటు దక్కలేదని
అఫ్రిది అడ్డుపడడంతో తనకు చోటు దక్కలేదని వాపోయాడు. జాతీయ క్రికెట్ అకాడమీకి రమ్మంటూ అప్పటి జట్టు చీఫ్ కోచ్ వకార్ యూనిస్, బ్యాటింగ్ కోచ్ గ్రాండ్ ఫ్లవర్ నాకు కబరు వచ్చింది. నెట్స్‌లో నాతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించి ఫిట్‌నెస్‌తోపాటు ఆటతీరును గమనించారు. జాతీయ జట్టులోకి రావడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నావా అని వకార్ భాయ్ అడిగాడు.

నేను సిద్ధమే అని చెప్పా
నేను సిద్ధమే అని చెప్పానని మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ సల్మాన్ వివరించాడు. నిషేధాన్ని పూర్తి చేసిన వారి భవిష్యత్ ఏంటి? అంటే.. ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని సల్మాన్ వాపోయాడు. ప్రపంచకప్ ఆడతావని వకార్, ఫ్లవర్ చెప్పినా.. అఫ్రిది ఎందుకు అడ్డుకున్నాడో తెలియదని, ఈ విషయం అతనితో ఎప్పుడూ మాట్లాడలేదని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications