Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ తీరు సరికాదు.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?: పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న షేక్‌హ్యాండ్ వివాదంపై ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్‌గా ఉంటారని, క్రీడాస్ఫూర్తికి విరుద్దమైన చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికాడు. షేక్ హ్యాండ్ వివాదంలో ముమ్మాటికి భారత్ జట్టుదే తప్పని, ఈ చర్యతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించాడు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌‌తో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆ దేశంతో సత్సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. టీమిండియా సైతం పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తమ నిరసనను తెలియజేసింది. ఆసియా కప్ 2025తో పాటు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026‌లోనూ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మహిళల, అండర్ 19 క్రికెట్‌లో కూడా ఈ ధోరణి కొనసాగింది. ఈ ఘటన ఇరు జట్ల మధ్య ఉన్న క్రికెట్ సంబంధాలను మరింత క్షీణింపజేసింది.

Salman Ali Agha Critiques Team India s Sportsmanship in Handshake Controversy in Asia Cup 2025

తాజాగా ఈ షేక్‌హ్యాండ్ వివాదంపై సల్మాన్ అఘా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వరని టాస్‌కు ముందే మ్యాచ్ రిఫరీ తనకు తెలియజేశాడని తెలిపాడు. 'నేను టాస్‌కి వెళ్ళగా.. మ్యాచ్ రిఫరీ నన్ను పక్కకు తీసుకెళ్లి.. భారత కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని నేను కూడా చెప్పలేనని అన్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మేం షేక్ హ్యాండ్ కోసం వారి డగౌట్‌లోకి వెళ్లినా.. కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఇలాంటి చర్యలు క్రీడాస్ఫూర్తికి విరుద్దం. యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.’అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

పీసీబీ చీఫ్ మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియాకప్ ట్రోఫీ‌ని తీసుకునేందుకు భారత్‌ నిరాకరించింది. నఖ్వీ మాత్రం తానే టైటిల్‌ను ప్రదానం చేస్తానని పట్టుబట్టాడు. నఖ్వీ ట్రోఫీ తన వెంట తీసుకెళ్లగా.. భారత ఆటగాళ్లు టైటిల్ లేకుండానే సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగింది. భారత్‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా బాయ్‌కట్ డ్రామా ఆడింది. చివరకు ఐసీసీ ఆంక్షలకు భయపడి మ్యాచ్‌ ఆడి చిత్తుగా ఓడింది.

Story first published: Saturday, May 2, 2026, 13:17 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+