For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిలక్ వర్మ‌ను క్రికెటర్‌ను చేసింది అతని తండ్రి కాదు.. ఎవరంటే?

నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పహల్గాం ఉగ్రదాడిలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే..ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ తెలుగు తేజం భారత్‌కు విజయ తిలకాన్ని దిద్దాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఓ మాట బాగా వైరల్ అయ్యింది.

పాకిస్థాన్ జట్టు అభిషేక్ శర్మ కోసం బాగా ప్రిపేర్ అయ్యి ఔట్ చేస్తే.. ఔటాఫ్ సిలబస్‌లా తిలక్ వర్మ దూసుకొచ్చి విజయాన్ని అందించాడు. పాక్ మాజీ క్రికెటర్లు సైతం అభిషేక్ శర్మను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్లేనని పాక్ ఆటగాళ్లకు నూరిపోసారు. అలానే అభిషేక్ శర్మను ఔట్ చేసిన అనంతరం పాకిస్థాన్ సంబరాలు చేసుకుంది. కానీ తిలక్ వర్మ మాత్రం చివరి వరకు నిలబడి.. పాక్ ఆశలను గల్లంతు చేశాడు.

Salam Bayash The Childhood Coach Who Single-Handedly Shaped Tilak Varma s Cricket Career
Photo Credit: X (twitter)

మిడిల్ క్లాస్ అబ్బాయి..

హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో గత నాలుగు సీజన్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ ఏడాదే ఇంగ్లండ్ కౌంటీల్లోకి అడుగుపెట్టాడు. హాంప్‌షైర్ తరపున బరిలోకి దిగాడు. 2023లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే అందరి క్రికెటర్లలానే అతని క్రికెట్ జర్నీ కూడా అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన తిలక్ వర్మ కెరీర్ అత్యంత ఒడిదుడుకులతో సాగింది.


ఎలక్ట్రీషియన్ కొడుకు..

నంబూరి నాగరాజు, గాయత్రి దేవి దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్నవాడే తిలక్ వర్మ. నాగరాజు ఒక సాధారణ ఎలక్ట్రీషియన్. తన కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడ్డాడు. తిలక్ వర్మకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఇష్టం. అందరి కుర్రాళ్లలానే సరదాగా క్రికెట్ ఆడేవాడు. అయితే తన 11వ ఏట టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న తిలక్ వర్మను సలామ్ బయాష్ అనే క్రికెట్ కోచ్ చూశాడు. 11 ఏళ్ల వయసులోనే అద్భుతంగా ఆడుతున్న తిలక్ వర్మను చూసి ఫిదా అయ్యాడు. అతని ప్రతిభను గుర్తించిన సలామ్ బయాష్ క్రికెటర్‌గా మంచి కెరీర్ ఉంటుందని తండ్రి నంబూరి నాగరాజుకు చెప్పాడు. కానీ తిలక్ వర్మ కోచింగ్‌ కోసం ఖర్చు చేసే స్థోమత తనకు లేదని ఆయన అన్నాడు. అయితే కోచ్ సలామ్ బయాష్.. ఆ ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పి నాగరాజును ఒప్పించాడు.

కోచ్ సలామ్ బయాష్..

సలామ్ కోచ్‌గా పని చేస్తున్న లీగాలా క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మను తన సొంత ఖర్చుతో చేర్పించాడు. అంతే కాకుండా తిలక్‌కు అవసరమైన కిట్, ఇతర సామాగ్రితో పాటు రవాణ ఖర్చులను కూడా సలామ్ భరించాడు. తిలక్ వర్మ 11వ ఏట నుంచి సలామ్ బయాష్ అన్నీ తానై చూసుకున్నాడు. తిలక్‌కు ఒక మెంటార్‌లా వ్యవహరించి.. ఒక మంచి బ్యాటర్‌గా తీర్చిదిద్దాడు. కొడుకు బాగా ఆడుతున్నాడనే విషయాన్ని గ్రహించిన నాగరాజు.. అతని కోచింగ్ కోసం మరింత కష్టపడ్డాడు. కొడుకు కావాల్సిన ఇతర అవసరాలను చూసుకున్నాడు. వారిద్దరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న తిలక్ వర్మ ఏజ్ క్రికెట్‌లో సత్తా చాటి హైదరాబాద్ రంజీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

తిలక్ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి తిలక్ వర్మ వెనుదిరిగి చూసుకోలేదు. ముంబై జట్టు కారణంగా ఆర్థిక సమస్యలు తొలిగిపోయాయి. ఐపీఎల్‌లో తిలక్ సత్తా చాటడంతో టీమిండియా పిలుపు కూడా దక్కింది. పొట్టి ఫార్మాట్‌లో తనదైన శైలిలో చెలరేగిన తిలక్.. జట్టులో తన స్థానాన్ని సుస్థీరం చేసుకున్నాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ఇతర ఫార్మాట్లలోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కోచ్ సలామ్ బయాష్ కారణంగా తిలక్ వర్మ ఈ రోజు సూపర్ స్టార్‌గా నిలబడ్డాడు.

Story first published: Monday, September 29, 2025, 16:39 [IST]
Other articles published on Sep 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+