అందుకే ఆ ట్వీట్ డిలీట్ చేసా.. జుంపాల జుట్టు బాగుండదు : ధోనీ సతీమణి

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు అతని సతీమణి సాక్షి సింగ్ చెక్ పెట్టింది. అలాగే 'ధోనీ రిటైర్స్' హాష్ ట్యాగ్‌పై తాను చేసిన ట్వీట్ గురించి కూడా స్పష్టత ఇచ్చింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న సాక్షి సింగ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
నేను ట్వీట్ చేయడంతోనే..
ఆగ్రహంగా తాను చేసిన ట్వీట్ గురించి మాట్లాడుతూ..‘అసలు ఏం జరుగుతుందని మా ఫ్రెండ్ అడిగే వరకు నాకు ఈ విషయం తెలియదు. అసలు ఆ హాష్ ట్యాగ్‌ను ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు. కానీ విపరీతంగా ట్రోల్ అయ్యింది. నేను కూడా దానికి స్పందిస్తూ ట్వీట్ చేయడంతో చర్చ రెట్టింపైంది. ఈ విషయాన్ని ఓ అభిమాని తెలియజేయడంతో నా తప్పు తెలుసుకున్న నేను వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించా. కానీ అప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది.'అని సాక్షి పేర్కొంది. క్రికెట్ గురించి మహీ ఎప్పుడూ ఎమోషనల్‌గా ఉంటాడని చెప్పిన సాక్షి.. ఆట అంటే అతనికి పిచ్చి అని వెల్లడించింది. సహచరులకు. సాయం చేయడానికి కూడా ఎప్పుడూ మందుంటాడంది.
ఇక లాక్‌డౌన్‌తో జనాలకు ఉన్న మతిపోయినట్లుందని ధోనీ రిటైర్మెంట్‌పై వచ్చి పుకార్లపై సాక్షి ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఏడు బైక్‌లు రిపేర్ చేశాడు..
ఇక ఈ లాక్‌డౌన్ కాలంలో అందరూ సినిమాలు చూస్తూ.. టిక్ టాక్ వీడియోలు చేస్తే.. మహీ మాత్రం తనకు ఇష్టమైన బైక్‌లను రిపేర్ చేశాడని సాక్షి సింగ్ చెప్పుకొచ్చింది. ‘ఓసారి ధోనీ బైక్ స్టార్ట్ చేస్తే కాలేదు. ఎందుకు అవడం లేదో చాలా సార్లు ట్రై చేసి చూశాడు. బండి పాతది కావడంతో కొన్ని భాగాలు చెడిపోయాయి. వెంటనే కొత్త పార్ట్స్‌ను తెప్పించి రిపేర్ చేశాడు. అలా లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో ఉన్న ఏడు పాత బైక్‌లను బాగు చేశాడు'అని సాక్షి పేర్కొంది.

జుంపాల జుట్టు ధోనీకి సూట్ అవ్వదు..
కెరీర్ ప్రారంభంలో జుంపాల జుట్టుతో ఉన్నధోనీ హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ సెన్సేషన్. అప్పటి పాకిస్థాన్ ప్రధాని పెర్వెజ్ ముషారఫ్ సైతం ధోనీ హెయిర్‌స్టైల్‌కు ముగ్దుడయ్యాడు. అభిమానులు కూడా చాలా మంది మహీ స్టైల్‌ను అనుకరించారు. అయితే ఆ హెయిర్‌స్టైల్ తనకు నచ్చదని సాక్షి తెలిపింది. అది జాన్ అబ్రహమ్‌కు బాగుంటుంది కానీ ధోనీకి సూట్ అవ్వదని స్పష్టం చేసింది. ‘అదృష్టవశాత్తు.. జుంపాల జుట్టులో ధోనీని నేను చూడలేదు. అలా చూసుంటే మరోసారి అతనివైపు కూడా చూడకపోయేదాన్ని. అది జాన్‌కు మాత్రమే సెట్ అవుతోంది.'అని సాక్షి చెప్పుకొచ్చింది.

పబ్‌జీ గేమ్ వ్యసనంగా మారింది..
ఇక లాక్‌డౌన్‌లో తన భర్త పబ్‌జీకి దాసోహం అయ్యాడని, నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడని సాక్షి చెప్పుకొచ్చింది. 'ధోనీ ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఆలోచనలు మాత్రం ఉండవు. అది సంతోషకరమే అయినా.. ఈ మధ్య ఆయనకు పబ్‌జీ వ్యసనంగా మారింది. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా..