న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీతో బంధానికి అప్పుడే పదేళ్లా.. నమ్మలేకపోతున్నా: సాక్షి

Sakshi Dhonis heartwarming post for MS Dhoni on their 10th wedding anniversary

రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీతో తన బంధానికి అప్పుడే పదేళ్లు నిండాయా? అని అతని సతీమణి సాక్షిసింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2010 జూలై4న సాక్షి-ధోనీ పెళ్లి జరగ్గా.. శనివారానికి వారి బంధానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇక ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ మూవీతో వీరి లవ్ స్టోర్ అందరికి సుపరిచితమే. ఓ హోటల్‌లో ఇంటర్న్‌షిప్‌కు వచ్చిన సాక్షి.. భారత కెప్టెన్ ధోనీని చూసి గుర్తుపట్టకపోవడం.. అసలు తనకు క్రికెటే ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం.. దీనికి మహీని ఫిదా అవ్వడం మనమంతా సినిమాలో చూశాం. ఇక తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి ఒక్కటైన ఈ జోడీ జీవితంలో ఆనంద క్షణాలే తప్ప ఎటువంటి గొడవలు లేవు.

ఆనందంగా గడుపుతున్న వీరి జీవితంలోకి జీవా వచ్చి ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. తాజాగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోనీ భార్య సాక్షి సింగ్ గత పదేళ్లలో వారి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఇందులో భాగంగా సాక్షి తన భర్త ధోనితో పాటు తమ గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది

'మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. పదేళ్లుగా ఇద్దరం కలిసి ఒక ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఒక మధురమైన క్షణం. నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం మీకు అర్థమయ్యే ఉంటుంది. ' అంటూ రాసుకొచ్చారు.

అంతకముందు ధోని, సాక్షిల పెళ్లి రోజు పురస్కరించుకొని బంధువులు, స్నేహితులు, అభిమానులు విషెస్‌ చెప్పారు. దానికి బదులుగా.. 'మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.' అంటూ సాక్షి స్పందించారు.

పాక్ చేతిలో ఓడిన తర్వాత భారత ఆటగాళ్లు క్షమాపణలు చెప్పేవారు: అఫ్రిదిపాక్ చేతిలో ఓడిన తర్వాత భారత ఆటగాళ్లు క్షమాపణలు చెప్పేవారు: అఫ్రిది

Story first published: Sunday, July 5, 2020, 15:10 [IST]
Other articles published on Jul 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X