Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ అటెన్షన్ కోసం కాళ్లు నొక్కిన సాక్షి!

Sakshi craves attention from MS Dhoni, Shares adorable picture

రాంచీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. యావత్ దేశాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో ఈ క్వారంటైన్ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. చిట్ చాట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.

ఇక ఈ సీజన్ ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో ఆస్వాదిస్తున్నాడు. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండే ధోనీ క్వారంటైన్‌కు సంబంధించిన అప్ డేట్స్‌ను అతని సతీమణి సాక్షిసింగ్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

మొన్న ధోనీ తోటమాలి అవతారాన్ని.. నిన్న వారి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లోని ఆహ్లాదకర వాతావారణాన్ని అభిమానులతో పంచుకున్న సాక్షి.. తాజాగా తన భర్త అటెన్షన్ కోసం కాళ్లు నొక్కుతున్న ఫొటోను షేర్ చేసింది. బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ధోనీని మిస్టర్ స్వీటీ అని సంభోదిస్తూ.. చూడముచ్చటైన ఫొటోను పంచుకుంది. దీనికి'మిస్టర్ స్వీటీ అటెన్షన్ కోసం..'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఇక ఇటీవల తమ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన సన్ సెట్ వీడియోను పంచుకున్న ఈ లెజండరీ ప్లేయర్ వైఫ్.. 'ఈ రోజులో చాలా అందమైన'భాగం అనే క్యాప్షన్‌గా పేర్కొంది.

ఇక దేశంలో పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ధోనీ పునరాగమనం కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మరో వైపు అతని భవితవ్వంపై ప్రశ్నార్థకంగా మారింది.

Story first published: Sunday, April 19, 2020, 20:51 [IST]
Other articles published on Apr 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+