Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను మా మ్యాచ్ విన్నర్.. పక్కన పెట్టం: టీమిండియా కోచ్

శ్రీలంకతో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన కుల్దీప్ యాదవ్‌‌కు టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అండగా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నర్ అని, రెండో టెస్ట్‌లో పుంజుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత ప్రణాళికల్లో అతను కీలకమని స్పష్టం చేశాడు.

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ తీవ్రంగా నిరాశపర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 25 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ తీసాడు. మరోవైపు మానవ్ సుతార్(10 వికెట్లు), రవీంద్ర జడేజా(4 వికెట్లు) సత్తా చాటారు. దాంతో కుల్దీప్ యాదవ్‌పై విమర్శలు వచ్చాయి. రెండో టెస్ట్‌కు కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెడుతారనే చర్చ జోరుగా సాగింది. అతని స్థానంలో 33 ఏళ్ల సారాన్ష్ జైన్‌కు అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అతను మ్యాచ్ విన్నర్.. జట్టు అండగా నిలవాలి: అజింక్యా రహానే

అతను మ్యాచ్ విన్నర్.. జట్టు అండగా నిలవాలి: అజింక్యా రహానే

కుల్దీప్‌కు కండిషన్స్ సూటవ్వలేదు..

అయితే ఈ వాదనను భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కొట్టిపారేసాడు. 'కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గాలే టెస్ట్‌లో ఎదురైన పరిస్థితుల వల్ల అతను భిన్నమైన పాత్ర పోషించాల్సి వచ్చింది. నా దృష్టిలో అతను ఎప్పుడూ మ్యాచ్ విన్నరే. జట్టు ప్రణాళికల్లో అతను ముఖ్యమైన ఆటగాడు.

Sairaj Bahutule Backs Kuldeep Yadav Despite Galle Struggles Says One Game Does Not Define Him
Photo Credit: X (twitter)

గాలే పరిస్థితులు కుల్దీప్ ప్రత్యేకమైన బౌలింగ్ శైలికి ప్రతికూలంగా మారాయి. బంతి షైన్ పోయిన తర్వాత కూకబుర్రా బంతి మెత్తబడుతుంది. ఆ బంతితో ఫింగర్ స్పిన్నర్ల వలే మణికట్టు స్పిన్నర్లు రాణించలేరు. ఎందుకంటే బంతి మెత్తబడటం వల్ల సీమ్ కిందికి వెళ్లిపోతుంది.

ఒక్క మ్యాచ్‌తోనే నిందించడం సరికాదు..

పిచ్ స్లోగా మారడంతో బంతి వేగాన్ని సర్దుబాటు చేసుకోవాలని కుల్దీప్ యాదవ్‌కు సూచించారు. ఒకే ఒక్క మ్యాచ్‌తో అతని సామర్థ్యంపై ఓ నిర్ణయానికి రావడం సరికాదు. తన పాత్రను సమర్ధవంతంగా పోషించేందుకు కుల్దీప్ యాదవ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.'అని సాయిరాజ్ బహుతులే చెప్పుకొచ్చాడు.

శుభ్‌మన్ గిల్ వల్లే కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు: అశ్విన్

Also Read

శుభ్‌మన్ గిల్ వల్లే కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు: అశ్విన్

ఆదివారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్ట్ మొదలవ్వనుంది. తొలి టెస్ట్‌లో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ కూడా గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

Story first published: Friday, August 21, 2026, 18:44 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+