Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. రాణించిన తెలుగు తేజం!

శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ ఓపెనర్ సాయి సుదర్శన్(175 బంతుల్లో 19 ఫోర్లతో 132) శతకంతో చెలరేగాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవరల్లో 4 వికెట్లకు 333 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్‌తో పాటు కెప్టెన్ ధ్రువ్ జురెల్(138 బంతుల్లో 5 ఫోర్లతో 68 బ్యాటింగ్), తెలుగు తేజం షేక్ రషీద్(92 బంతుల్లో 4 ఫోర్లతో 53) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక-ఏ బౌలర్లలో సుదీర రెండు వికెట్లు తీయగా.. చామిక గుణశేఖర, రావిందు ఫెర్నాండో తలో వికెట్ తీసారు.

Sai Sudharsan Slams 9th First-Class Hundred as India A Post 333 4 on Day 1 vs Sri Lanka A Dhruv Jurel and Shaik Rasheed Hit Fifties

గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, ఆయుష్ పాండే(25) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఆయుష్ పాండే‌ను తిలకరత్నే ఔట్ చేయగా.. దేవదత్ పడిక్కల్ సాయంతో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ కోసం అతనిపై వేటు!

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ కోసం అతనిపై వేటు!

అయితే పడిక్కల్(12) ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం తగ్గింది. మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్(22) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ రాగా.. సాయి సుదర్శన్ శతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం సాయి సుదర్శన్‌ను గుణశేఖర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

IPL 2026: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. కోహ్లీకి దక్కని రికార్డ్ సొంతం!

IPL 2026: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. కోహ్లీకి దక్కని రికార్డ్ సొంతం!

తెలుగు తేజం షేక్ రషీద్‌తో కలిసి ఆచితూచి ఆడిన ధ్రువ్ జురెల్‌ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో ఐదో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

Story first published: Thursday, June 25, 2026, 18:06 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+