IPL 2026: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. కోహ్లీకి దక్కని రికార్డ్ సొంతం!
గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సాయి సుదర్శన్.. 53 బంతుల్లో 84 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఐపీఎల్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదిన జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2012 సీజన్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ ఈ ఘనతను అందుకున్నారు.

2018లో రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ సాధించాడు. గత ఏడేళ్లుగా ఈ ఫీట్ ఎవరూ అందుకోపోగా.. సాయి సుదర్శన్ తాజా సీజన్‌లో ఈ రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ టాప్ స్కోరర్, నిలకడకు మారుపేరైనా విరాట్ కోహ్లీకి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో 13 పరుగులే చేసిన సాయిసుదర్శన్.. రాజస్థాన్ రాయల్స్‌తో రెండో మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు. ఆర్‌సీబీపై సెంచరీ బాదిన సాయి సుదర్శన్.. సీఎస్‌కేపై మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌లపై వరుసగా 57, 55, 61, 53* పరుగులు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రికార్డ్ రియాన్ పరాగ్ పేరిట ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను వరుసగా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
సాయి సుదర్శన్‌తో పాటు శుభ్‌మన్ గిల్(64), జోస్ బట్లర్(57 నాటౌట్) రాణించడంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications