Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, ధోనీ కాదు.. అతనే నా ఆరాధ్య క్రికెటర్: సాయి సుదర్శన్

విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ అని టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తెలిపాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలో బాగా చూసేవాడినని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన సాయి సుదర్శన్.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్‌ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్‌ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి సుదర్శన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'నా చిన్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌ను అభిమానించేవాడిని. తమిళనాడు ప్లేయర్‌గా ఆ సమయంలో అతనే నాకు తెలిసిన పెద్ద ప్లేయర్. లాక్‌డౌన్ సమయంలో నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఇంటర్వ్యూలు బాగా చూసాను. భారత్‌కు ఆడుతున్నప్పటి నుంచి జస్టిన్ లాంగర్, మైక్ హస్సీ‌ల బ్యాటింగ్ వీడియోలు చూసి నేర్చుకుంటున్నాను. కానీ మా నాన్న భరద్వాజే నాకు హీరో. ఆయన ఇంటర్నేషనల్ స్ప్రింటర్. ఆయన నుంచే కెరీర్‌లో సక్సెస్ సాధించాలనే కసిని నేర్చుకున్నాను.

Sai Sudharsan Calls Virat Kohli His Idol Aims to Follow His Footsteps

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత నా ఫేవరేట్ విరాట్ కోహ్లీని కలిసాను. అభినందనలు తెలిపాను. అది ఆయనకు ప్రత్యేకమైన క్షణం. దాంతో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. కానీ అంతకుముందు చాలా సార్లు కోహ్లీతో మాట్లాడాను. ఆయనలో నాకు నచ్చేది మైండ్‌సెట్. ఆటపై ఆయనకు ఉన్న మక్కువ. పరుగులు చేయనప్పుడు.. ఫామ్‌లో లేనప్పుడు.. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేస్తారని అడిగి తెలుసుకున్నాను. ప్రతీ క్రికెటర్‌ ఇలాంటి దశను ఎదుర్కొంటాడు. కాబట్టి నేను ఆ విషయాల గురించి మాట్లాడాను.

కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటును పూడ్చాలని నేను అనుకోవడం లేదు. అసలు నేను ఆ విధంగా ఆలోచించడం లేదు. నేను ఎలాంటి సవాల్‌ను అయినా స్వీకరించేందుకు సిద్దమవుతున్నాను. కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేయడం అంత సులువైన పనికాదు. కానీ నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాను. అద్భుతమైన విజయాల్లో భాగమై నా దేశానికి మధుర జ్ఞాపకాలు మిగల్చాలని భావిస్తున్నా.'అని సాయి సుదర్శన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, June 7, 2025, 23:04 [IST]
Other articles published on Jun 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+