For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs NAM: చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్!

పాకిస్థాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ బాదిన రెండో పాక్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫర్హాన్ 57 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. పాకిస్థాన్ తరఫున అహ్మద్ షెహ్‌జాద్ ఒక్కడే టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ బాదాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో అహ్మద్ షెహ్‌జాద్.. బంగ్లాదేశ్‌పై 62 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ ఉమర్ అక్మల్ 94 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు సత్తా చాటారు. ఫర్హాన్(58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయశతకంతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Sahibzada Farhan Becomes Second Pakistan Batter to Score T20 World Cup Century in PAK vs NAM

ఫర్హాన్‌కు తోడుగా కెప్టెన్ సల్మాన్ అఘా( 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభాన్నే అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో సైమ్ అయూబ్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సల్మాన్ అఘాతో కలిసి ఫర్హాన్ దూకుడుగా ఆడాడు. బౌండరీల మోత మోగిని ఫర్హాన్ 37 బంతుల్లోనే హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది.

హాఫ్ సెంచరీ అనంతరం ఫర్హాన్ మరింత దూకుడుగా ఆడాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన సల్మాన్ అఘాను బ్రాస్సెల్ ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఖవాజా నఫే(5) విఫలమవ్వగా.. షాదాబ్ ఖాన్‌తో కలిసి ఫర్హాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు .

ఈ క్రమంలో అతను 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. షాదాబ్ ఖాన్(36 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఫర్హాన్‌కు ఇదే తొలి టీ20 సెంచరీ కావడం గమనార్హం. భారత్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన షాహిన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్‌‌లపై పాకిస్థాన్ జట్టు వేటు వేసింది. వారి స్థానాల్లో సల్మాన్ మిర్జా, ఖవాజా నఫీని ఆడించింది.

Story first published: Wednesday, February 18, 2026, 17:13 [IST]
Other articles published on Feb 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+