
భుజంనొప్పికి శస్తచ్రికిత్స జరిగిన తర్వాత
మహేంద్ర సింగ్ ధోనీ 2014 డిసెంబర్‌లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అంతటి సత్తా కలిగిన వికెట్ కీపర్‌గా 34 ఏళ్ల సాహా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. భుజంనొప్పికి శస్తచ్రికిత్స జరిగిన తర్వాత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న సాహా ప్రస్తుతం టీమిండియాలో లేకున్నా గత ఐదు, పదేళ్లుగా భారత్‌కు లభించిన గొప్ప వికెట్ కీపర్ అని గంగూలీ నొక్కిచెప్పాడు.
మాకు పోటీ ఉండదు.. ఆ విషయంలో ఎవరి దారి వాళ్లదే: కోహ్లీ

పదేళ్లలో భారత్ తరఫున కీపర్లందరిలో
‘దాదాపు ఏడాదిగా సాహా జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ గత పదేళ్లలో వచ్చిన భారత జట్టు తరఫున ఆడిన వికెట్ కీపర్లందరిలో అతనే అత్యుత్తమం. గాయాలనేవి ఆటగాడి చేతిలో ఉండవు. వికెట్ కీపర్ అన్నాక దూకాల్సిందే. అలా దూకేటపుడే సాహా గాయపడ్డాడు. కోలుకోవడానికి సమయం పడుతుంది. అతను త్వరగా మామూలు స్థితికి చేరుకుని పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నా' అని గంగూలీ అన్నాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో సైతం సాహాకు అవకాశాలు
సాహా వచ్చే నెలలో రంజీ ట్రోఫీ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. సాహాది కూడా బెంగాల్ అన్న సంగతి తెలిసిందే. వృద్ధిమాన్ సాహా టీమిండియా తరఫున ఇంతవరకు ఆడిన 32 టెస్టుల్లో 1164 పరుగులు చేయగా, ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో గాయపడడంతో సిరీస్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జూలైలో ఆస్ట్రేలియా టూర్‌లో సైతం సాహా ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది

భావి కీపర్‌గా రాణిస్తాడంటూ పంత్‌కు ఛాన్సులు
ఇటీవల భావి కీపర్‌గా రాణిస్తాడంటూ రిషబ్ పంత్‌కు ఛాన్సులు కల్పిస్తుంది టీమిండియా. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలోనూ కీపర్‌గా కనిపించాడు పంత్. ఒకానొక దశలో కీపర్‌గా దినేశ్ కార్తీక్ కంటే పంతే బెస్ట్ అని కూడా గంగూలీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












