Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాకు పోటీ ఉండదు.. ఆ విషయంలో ఎవరి దారి వాళ్లదే: కోహ్లీ

There Is No Room For Competition With Her Says Virat Kohli | Oneindia Telugu
There is no room for competition with Anushka: Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో ఫొటోలు పంచుకుంటూనే ఉంటాడు. ప్రతి ఫొటోలోనూ అనుష్క శర్మ గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటాడు. ఈ మధ్యనే పూమాలోని మరో బ్రాండ్ అయినటువంటి ఒన్8 బ్రాండ్‌ను కోహ్లీ మొదలుపెట్టాడు. ఫ్యాషన్ కమ్ స్పోర్ట్స్‌ ఆధారిత వ్యాపారం కావడంతో అనుష్కకు కోహ్లీకి మధ్య పోటీతత్వం ఏమైనా నెలకొనబోతుందా అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.

మా మధ్య పోటీ ఉండదు

మా మధ్య పోటీ ఉండదు

మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలను ఇతరులతో పంచుకోవడానికి మేం ఇద్దరం ఇష్ట పడం. అవి మా వ్యక్తిగతం. అందులో మా ఇద్దరి వృత్తిపరమైన అంశాలుండవచ్చు. మేం ఇద్దరం వ్యాపారంలో ఉన్నాం. వ్యాపార పరంగా మా ఇద్దరి మధ్య పోటీ ఉండదు. ఆమె చలన చిత్ర రంగంలో ఉంది. క్రీడారంగంలో ఉన్నాను. మా ఇద్దరి వృత్తి వేరు. ఆమె కంటే ఎక్కువ సాధించాలని అనుకోను.

బయటపెడితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా

బయటపెడితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా

అనుష్క ఎన్నోరోజుల నుంచి ఆ రంగంలో ఉంది. సొంతకాళ్లపై నిలబడి ఈ స్థాయికి వచ్చింది. దేశంలోని అతిపెద్ద ప్రముఖుల్లో ఆమె కూడా ఒకరు. మా ఇద్దరి వివాహం కాకముందే ఆమె ఓ సెలబ్రిటీ. ఆమెకు తన స్వతంత్రభావాలున్నాయి. మా ఇద్దరి విషయాలు మేం బయటపెడితే ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా దాన్ని స్వీకరిస్తారు. అది మాకు ఇష్టం లేదు.

నేను కూడా అదే నమ్మకంతో ఇలా

నేను కూడా అదే నమ్మకంతో ఇలా

ఈ విషయంలో నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి విషయం మంచిగానే జరుగుతుండటం చాలా ఆనందాన్నిస్తోంది. స్పోర్ట్స్ తర్వాత కెరీర్‌లో మరో వ్యాపకం ఉండాలని భావించాను. ఇందులో భాగంగానే నా సొంత బ్రాండ్ అయినటువంటి ఒన్ 8 ప్రచారంలోనూ పాలు పంచుకుంటున్నాను. ఫ్యాషన్‌లో ఇదో కొత్త ప్రపంచం అడుగుపెట్టాను. ఇప్పటికే నా కుటుంబంలో బావమరిది, నా అన్న సూట్స్, షూస్ వంటి రంగాల్లో ఉన్నారు. నేను కూడా అదే నమ్మకంతో ఈ రంగంలోకి దిగాను.

 నా కెరీర్‌కు ఇబ్బంది తీసుకురాదంటూ

నా కెరీర్‌కు ఇబ్బంది తీసుకురాదంటూ

సమావేశం జరుగుతుండగా ఓ విలేకరి.. సోషల్ మీడియా వేదికగా మీరు అభిమానిని దేశం వదలివెళ్లిపొమ్మన్నారని అడిగిన ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పి దాటేశాడు. ఇట్స్ ఓకే అంటూ వదిలేశాడు. అవేమీ నా కెరీర్‌కు ఇబ్బంది తీసుకురాదంటూ చెప్పుకొచ్చొడు. అతని బిజీ జీవితంలో ప్రధానంగా తన క్రీడకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని మిగిలిన సమయంలో వ్యాపారం మొదలుపెట్టడానికి కుదరనే లేదని చెప్పాడు. సమయం తక్కువగా ఉన్నప్పుడు కూడా దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే మంచిది.

Story first published: Sunday, November 11, 2018, 18:05 [IST]
Other articles published on Nov 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+