22 బంతుల్లో యువరాజ్ హాఫ్ సెంచరీ.. సచిన్ ధనాధన్ ఇన్నింగ్స్! దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!

రాయ్‌పూర్: వయసు పెరిగినా వన్నె తరుగలేదని నిరూపించాడు సిక్సర్ల వీరుడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. తాజాగా వరుస సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో యువీ ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. యువీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత లెజెండ్స్ జట్టు 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

యువరాజ్ మెరుపులు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (6) నిరాశపరిచినా.. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (60: 37 బంతుల్లో 9x4, 2x6), యువరాజ్ సింగ్ (52 నాటౌట్: 22 బంతుల్లో 2x4, 6x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఎస్ బద్రీనాథ్ (34 బంతుల్లో 42 రిటైర్డ్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యూసఫ్ పఠాన్ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా తోడవడంతో టీమిండియా ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

మంచి ఆరంభం దక్కినా
అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్ 147/8కే పరిమితమైంది. ఓపెనర్లు ఆండ్రూ పుటిక్ (41), మోర్న్ వాన్ వైక్ (48) మంచి ఆరంభం ఇచ్చారు. పుటిక్ బౌండరీలు బాధగా.. వాన్ వైక్ సిక్సులు కూడా బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా తడబడింది. ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ పరుగులు చేయలేకపోయారు. జోంటి రోడ్స్ మాత్రమే 22 రన్స్ చేశాడు. యూసుఫ్ 3, యువరాజ్ 2 వికెట్లు పడగొట్టరు.

6, 6, 6, 6
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాండర్ బ్రూన్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. ఈ ఓవర్లో మొదటి బంతి డాట్ అవగా.. ఆ తర్వాత యువీ వరుసగా నాలుగు బంతులను 6, 6, 6, 6 రూపంలో స్టాండ్స్‌లోకి తరలించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

సెహ్వాగ్, ఇర్ఫాన్ మెరుపులు
ఇదే సిరీస్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. వీరూ సాధించిన 80 పరుగుల్లో 70 పరగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించినవే. సెహ్వాగ్‌కు సచిన్ (26 బంతుల్లో 33; 5 ఫోర్లు) దూకుడు కూడా తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే రీతిలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయి 34 బంతుల్లో 61 పరుగులతో విజృంభించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం ముంగిట ఆగిపోయింది.
ISL 2020 21: ఛాంపియన్ ముంబై.. ఫైనల్లో మోహన్‌బగాన్‌కు నిరాశ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications