గంభీర్ గారూ.. ఆర్‌సీబీ ఆటగాళ్లు ఏం పాపం చేశారు: టీమిండియా మాజీ ఓపెనర్
టీమిండియా టీ20 సెలెక్షన్ తీరుపై మాజీ ఓపెనర్ సదగోపన్ రమేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఎంపికలో ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆటగాళ్ల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించాడు. అసలు వారు ఏం పాపం చేశారని, గణంకాలతో సహా నిలదీసాడు. వరుసగా రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో ఒక్కరికి అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు.
ఎందుకు ఈ వివక్ష..?
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాట్లాడిన సదగోపన్ రమేష్.. కొందరికి మాత్రమే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు. 'టీమిండియా టీ20 సెలెక్షన్ పూర్తిగా ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగానే జరుగుతుంది. కానీ ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది.

ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. కానీ వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన ఆర్‌సీబీ జట్టు నుంచి ఒక్క ప్లేయర్‌కు కూడా అవకాశం దక్కలేదు. విచిత్రం ఏంటంటే.. ఐపీఎల్ 2026 సీజన్ సెకండాఫ్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడని రవి బిష్ణోయ్‌కు ఏకంగా భారత తుది జట్టులోనే చోటు దక్కింది.
టాప్ ప్లేయర్స్‌కు నో ఛాన్స్..
ఐపీఎల్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని సూర్యాన్ష్ షెడ్గే కూడా ఆల్‌రౌండర్‌గా భారత జట్టులోకి తీసుకున్నారు. అంటే ఐపీఎల్ ప్రదర్శనలను కూడా కొందరి విషయంలోనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. చాలా మందిని పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
104 మంది విద్యార్థులను పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తే.. సహజంగా అత్యధిక పరుగులు సాధించిన టాప్-10ను ఎంచుకుంటారు. ఇది ఐపీఎల్‌కు వర్తింప జేస్తే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో కనీసం ఒక వికెట్ తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన బౌలర్లు 104 మంది ఉన్నారు. టాప్-10లో ఆర్‌సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో సహా మొత్తం ఐదుగురు భారత బౌలర్లు ఉన్నారు. కానీ ఇందులో ఎవరూ జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవ్వలేదు.
ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు..
47వ స్థానంలో నిలిచిన హర్ష్‌దూబే, 55వ స్థానంలో ఉన్న అశోక్ శర్మ, 89వ ప్లేస్‌లో ఉన్న యశ్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది.విచిత్రం ఏంటంటే.. అసలు ఈ జాబితాలోనే లేని మయాంక్ యాదవ్‌కు కూడా టీమిండియా పిలుపు దక్కింది. 2024లో భారత్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మయాంక్ యాదవ్ ఆడింది కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే.'అని సదగోపన్ రమేష్ అసహనం వ్యక్తం చేశాడు.
భువనేశ్వర్ కుమార్‌తో పాటు అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్, రసిక్ సలామ్ దార్, కార్తీక్ త్యాగి వంటి భారత బౌలర్లు ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్-10లో నిలిచారు. కానీ వీరిని సెలెక్టర్లు పట్టించుకోలేదు. భువీకి వయసు ఎక్కువని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విశ్రాంతి పేరిట సిరాజ్‌ను పక్కనపెడుతున్నారు. మిగతా ఆటగాళ్లను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఆర్‌సీబీ తరఫున రసిక్ సలామ్ దార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


