టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గంభీర్‌ను తొలగించాలని సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్‌ను తీసేస్తే కానీ జట్టు బాగుపడదని సూచిస్తున్నారు.
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సౌతాఫ్రికా 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడిన వికెట్‌పై భారత బ్యాటర్లు విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్(97 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58).. లోయరార్డర్ వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 48) మినహా మరే బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) తీవ్రంగా నిరాశపర్చారు. అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా జట్టును ఆదుకోవాల్సిన రిషభ్ పంత్.. అనవసర షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు.

కనీసం ఫాలో ఆన్ స్కోర్ కూడా చేయకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలవ ప్రదర్శనకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే కారణమని మండిపడుతున్నారు. పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేశాడని, ఆటగాళ్లతో మ్యూజికల్ ఛైర్ ఆడుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతన్ని కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను కాదని సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఐపీఎల్ స్టార్లను తీసుకున్న గంభీరే ఈ ఘోర వైఫల్యాన్ని బాధ్యుడని మండిపడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోకుండా.. నితీష్ కుమార్ రెడ్డి వంటి ఫామ్‌లో లేని ఆటగాడిని ఆడించాడం తెలివి తక్కువ నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. రంజీల్లో రాణించే ఆటగాళ్లను పట్టించుకోకుండా భారత మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కొంటుందని, అతన్ని వెంటనే తొలగించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. తన అనాలోచిత నిర్ణయాలతో కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేలా చేసాడని, మహమ్మద్ షమీని ఎంపిక చేయకుండా వ్యక్తిగత నిర్ణయాలతో జట్టును నాశనం చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
గంభీర్ పర్యవేక్షణలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. మరో క్లీన్ స్వీప్‌కు రెడీ అయ్యింది. అద్భుతం జరిగితే తప్పా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో భారత్ ఓటమిని తప్పించుకునే అవకాశాలు లేవు.