For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar: ఒలింపిక్స్ బరిలో దిగే భారత అథ్లెట్లకు అండగా ఉందాం

Sachin Tendulkar Wishes Indian Contingent For Tokyo Olympics

ముంబై: యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టోక్యో ఒలింపిక్స్‌కు రంగం సిద్దమైంది. మరో 17 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ సమ్మర్ గేమ్స్‌లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపాడు. కరోనా వైరస్‌ విపత్కర పరిస్థితుల్లోనూ వారెన్నో సవాళ్లను ఎదుర్కొని నిరంతరం కష్టపడ్డారని ప్రశంసించాడు. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ ఈనెల 23 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 100 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌ పోటీలకు అర్హత సాధించగా సచిన్‌ వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ.. వారందరికీ యావత్​ దేశం ప్రోత్సాహం అందించాలని కోరాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు.

అండగా ఉందాం..

'కరోనా కారణంగా అథ్లెట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా నిరంతరం ఒలింపిక్స్‌ కోసం శ్రమించారు. టోక్యో ఒలింపిక్స్‌లో వాళ్లంతా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నారని నాకు తెలుసు. అయితే, గెలుపోటములనేవి రెప్పపాటులో జరిగిపోతాయి. అందుకోసమే వీరంతా కొన్నేళ్లుగా కఠోర సాధన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి మనమంతా అండగా ఉండాలి. మన నుంచి మద్దతు, శుభాకాంక్షలు వారికి కావాలి. ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ఆకాంక్షిస్తూ వారికి పూర్తి మద్దతు తెలుపుదాం' అని సచిన్‌ ఆ వీడియో ద్వారా భారత ప్రజలకు పిలుపునిచ్చాడు.

పతాకధారులుగా మేరీకోమ్, మన్‌ప్రీత్‌

పతాకధారులుగా మేరీకోమ్, మన్‌ప్రీత్‌

మొత్తం 115 మంది భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌లకు దక్కింది. భారత ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) సోమవారం వీళ్లిద్దరినీ పతాకధారులుగా ప్రకటించింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడని తెలిపింది. లింగ సమానత్వం పాటించాలనే సదుద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

భారత అథ్లెటిక్స్‌ జట్టు...

భారత అథ్లెటిక్స్‌ జట్టు...

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య సోమవారం 26 మంది సభ్యుల అథ్లెటిక్స్‌ బృందాన్ని ప్రకటించింది. ద్యుతిచంద్‌ (మహిళల 100, 200 మీ), ఎంపీ జబీర్‌ (పురుషుల 400 మీ హర్డిల్స్‌), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (పురుషుల 50 కి.మీ నడక), అన్నురాణి (మహిళల జావెలిన్‌)లకు ర్యాంకింగ్స్‌ ద్వారా బెర్తులు దక్కాయి. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే కోసం ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళల బృందాన్ని ఎంపిక చేశారు.

పురుషులు: అవినాశ్‌ (3000 మీ స్టీపుల్‌ఛేజ్‌), ఎంపీ జబీర్‌ (400 మీ హర్డిల్స్‌), శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌), తేజిందర్‌పాల్‌ (షాట్‌పుట్‌), నీరజ్‌ చోప్రా, శివ్‌పాల్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో), ఇర్ఫాన్‌, సందీప్‌, రాహుల్‌ (20 కి.మీ నడక), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (50 కి.మీ నడక), 4×400 మీ రిలే: అమోజ్‌ జాకబ్‌, అరోకియా రాజీవ్‌, మహ్మద్‌ అనాస్‌, నాగనాథన్‌, నిర్మల్‌ తోమ్‌; 4×400 మీ మిక్స్‌డ్‌ రిలే: సార్థక్‌ బాంబ్రి, అలెక్స్‌ ఆంథోని.

మహిళలు: ద్యుతిచంద్‌ (100 మీ, 200 మీ), కమల్‌ప్రీత్‌ కౌర్‌, సీమా పునియా (డిస్కస్‌ త్రో), అన్నురాణి (జావెలిన్‌ త్రో), భావ్నా జాట్‌, ప్రియాంక గోస్వామి (20 కి.మీ నడక), 4×400 మీ మిక్స్‌డ్‌ రిలే: రేవతి, శుభ, ధనలక్ష్మి

Story first published: Tuesday, July 6, 2021, 20:50 [IST]
Other articles published on Jul 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+