మన్కడింగ్ రనౌట్‌గా మార్చడం మంచి నిర్ణయం: సచిన్ టెండూల్కర్

ముంబై: క్రికెట్ చట్టాలను సంరక్షించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సవరించిన కొత్త నిబంధనలపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ నిబంధనలు ఆహ్వానించదగినవని, ముందుగా మన్కడింగ్ అనే పదం తొలిగించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. మన్కడింగ్‌ను రనౌట్ కేటగిరిలోకి మార్చింది. అలాగే, బంతిపై మెరుపు తెచ్చేందుకు ఉమ్మి రుద్దడాన్ని శాశ్వతంగా నిషేధించింది. కొత్త బ్యాటర్ ఎటువైపు బ్యాటింగ్ చేయాలనే రూల్‌ను కూడా మార్చింది.
అయితే, ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌లో అమల్లోకి రానున్నాయి. ఈ లోగా అంతర్జాతీయంగా అంపైర్లు, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వనుంది. ఈ మార్పులపై సచిన్ టెండూల్కర్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు.

రూల్స్ బాగున్నాయి..
‘ఎంసీసీ కమిటీ సవరించి తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగున్నాయి. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌కు మన్కడింగ్ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు.

బ్యాట్స్‌మన్ స్ట్రైకింగ్ కూడా..
ఇక రెండో రూల్ ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్‌డన్'' అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.

ఎంసీసీ రూల్స్ ఇవే..
మన్కడింగ్‌ను రనౌల్ కేటగిరిలోకి మార్చారు. అలాగే, బాల్‌పై మెరుపు తెచ్చేందుకు సలైవా(ఉమ్మి) రుద్దడంపై నిషేధాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా తాత్కలికంగా తీసుకున్న నిర్ణయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించనున్నారు. ఇకపై రీప్లేస్‌మెంట్‌గా వచ్చే ఆటగాడిని ఒరిజినల్ ప్లేయర్‌గా పరిగణిస్తారు.
క్యాచ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ ఓవర్ ముగిస్తే తప్ప స్ట్రైయిక్ ఎండ్‌లోకి రావద్దు. క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. బ్యాట్స్‌మన్ బాల్‌ను ఎదుర్కొంటున్నప్పుడు ఫీల్డర్లు గ్రౌండ్‌లో ఉద్దేశ పూర్వకంగా కదిలితే ఫీల్డింగ్ జట్టుకు పెనాల్టీ విధించి బ్యాటింగ్ టీమ్‌కు ఐదు రన్స్ ఇస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications