Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ అంపైర్స్ కాల్‌ను తీసేయండి.. దాంతో ఆటగాళ్లకు అన్యాయం: సచిన్

Sachin Tendulkar wants DRS system to be thoroughly looked into over ‘umpire’s call issue
Sachin Tendulkar Urges ICC To 'Thoroughly' Look Into Umpire's Call In DRS Reviews

ముంబై: అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్‌ఎస్)‌లోని 'అంపైర్స్ కాల్' నిబంధనపై పునరాలోచన చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కోరుతున్నాడు. తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా కూడా మాస్టర్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. ఈ నిబంధనతో ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని వెంటనే మార్చేయాల్సిన అవసరం ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు.

నచ్చకపోతనే కదా..

అస‌లు ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తితోనే ఆటగాళ్లు డీఆర్ఎస్ కోర‌తార‌ని, అలాంట‌ప్పుడు ఈ అంపైర్స్ కాల్ ఏంటని ప్రశ్నిస్తూ స‌చిన్ ట్వీట్ చేశాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నప్పుడే ఆటగాళ్లు సమీక్షకు వెళ్తారు. డీఆర్‌ఎస్‌ పద్దతిని నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా అంపైర్స్ కాల్‌ను మార్చాల్సిన అవసరం ఉంది.'అని ఐసీసీకి ట్యాగ్ చేస్తూ మాస్టర్ ట్వీట్ చేశాడు. ఈ అంపైర్స్ కాల్ నిబంధ‌న కార‌ణంగా రెండో టెస్ట్‌లో టీమిండియా రెండు వికెట్ల‌ను తీయ‌లేక‌పోయింది. జో బర్న్స్, మార్నస్ లబుషేన్ ఇద్దరూ అంపైర్స్ కాల్ నిబంధనతో బతికిపోయారు.

అంపైర్స్ కాల్ అంటే..

అంపైర్స్ కాల్ అంటే..

ఇక క్లిష్టమైన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్లకు ఐసీసీ ఈ డీఆర్ఎస్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. బంతి 50 శాతం వికెట్లను హిట్ చేయగలిగితే ఔటివ్వాలని, అంతకు తక్కువగా ఉంటే అంపైర్ తీసుకునేదే(అంపైర్స్ కాల్) తుది నిర్ణయమని నిబంధన పెట్టింది. అంటే 50 శాతం కంటే తక్కవగా బంతి వికెట్లను తాకితే అంపైర్ ఔటిస్తే ఔట్ లేకుంటే లేదు. అలా కాకుండా బంతి నేరుగా వికెట్ల‌ను త‌గ‌ల‌కుండా కేవ‌లం అంచుల‌ను తాకుతూ వెళ్తుంద‌ని తేలిన‌ప్పుడు కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యమే నిలుస్తుంది. దీన్నే అంపైర్స్ కాల్ అంటారు.

ఈ 50-50 ఏంది? వికెట్లకు తాకితే..

ఈ 50-50 ఏంది? వికెట్లకు తాకితే..

అయితే సచిన్ మాత్రం బంతి వికెట్లకు తాకితే ఔటివ్వాల్సిందేనంటున్నాడు. గతంతో లారాతో ఈ విషయాన్ని చర్చించాడు. ‘బ్యాట్స్‌మెన్ కానీ, బౌలర్ కానీ రివ్యూ కోరారంటే వారు ఆన్‌ఫీల్డ్ నిర్ణయంతో సంతృప్తి చెందలేదని అర్థం. అలాంటి సమయంలో థర్డ్ అంపైర్ పూర్తి అధికారాన్ని తీసుకోవాలి. టెన్నిస్‌లో ఎలాగైతే బంతి గీతకు బయట పడిందా, లేదా అనే విషయం స్పష్టంగా టెక్నాలజీ సాయంతో చెబుతారో.. అదే విధంగా క్రికెట్‌లో కూడా చెప్పాలి. అంతేకానీ అటు, ఇటు కాకుండా మధ్యలో ఊగిసలాడకూడదు. మళ్లీ ఆన్‌‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే సమర్థించకూడదు' అంటూ సచిన్ అప్పట్లో లారాతో అన్న వీడియోను ట్వీట్ చేశాడు.

విజయం ముంగిట భారత్..

విజయం ముంగిట భారత్..

ఇక అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ.. బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత అదరగొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా.. సూపర్ బౌలింగ్, తాత్కలిక సారథి రహానే అద్భుత సెంచరీతో ఆసీస్‌పై ఆధ్యాంతం ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకు పరిమితం చేసిన.. భారత్ బదులుగా 326 పరుగులు చేసి 131 రన్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను 6 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసింది. కేవలం 2 పరుగుల ఆధిక్యంలోనే ఆసీస్ ఉండగా.. మిగిలిన నాలుగు వికెట్లు ఎంత త్వరగా తీస్తే భారత విజయం అంత సులువు అవుతోంది.

Story first published: Monday, December 28, 2020, 14:03 [IST]
Other articles published on Dec 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+