Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ Vs రోహిత్, ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్?: భజ్జీ చెప్పిన సమాధానం ఇదీ!

Is Rohit Sharma a better batsman than Virat Kohli? Harbhajan Singh gives his verdict

హైదరాబాద్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు వారిద్దరి బ్యాటింగ్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. ఎందుకంటే ఒకరేమో రన్ మెషిన్, మరొకరేమో హిట్ మ్యాన్. క్రీజులో పాతుకుపోయారంటే ఈ ఇద్దరిని ఔట్ చేయడం ఎవరి వల్ల కాదని తొలి వన్డే అనంతరం జడేజా చెప్పుకొచ్చాడు.

అలాంటిది ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే మాత్రం టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మకే ఓటేశాడు. కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. విండిస్‌తో గువహటి వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ (140), రోహిత్ శర్మ(152 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు.

రెండో వికెట్‌కి 246 పరుగుల భాగస్వామ్యం

రెండో వికెట్‌కి 246 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ రెండో వికెట్‌కి 246 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం 42.1 ఓవర్లలోనే టీమిండియా అలవోకగా చేధించింది. లక్ష్య ఛేదనలో ఏ వికెట్‌కైనా భారత్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో తొలి వన్డే‌లో ఇద్దరి బ్యాటింగ్‌ను చూశారు కదా? వీరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్? అని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్‌ని ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించాడు.

విశాఖపట్నంలో రెండో వన్డే: ఒకే రికార్డు వేటలో కోహ్లీ, ధోని

 తొలుత రోహిత్ శర్మ గురించి మాట్లాడతా

తొలుత రోహిత్ శర్మ గురించి మాట్లాడతా

"నేను తొలుత రోహిత్ శర్మ గురించి మాట్లాడతాను. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య డర్బన్‌లో మ్యాచ్‌ జరిగింది. బౌన్సీ పిచ్ కావడంతో సఫారీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. అయినా... అతని బౌలింగ్‌లో రోహిత్ శర్మ మూడు నాలుగు సిక్సర్లు బాదాడు" అని అన్నాడు.

 రోహిత్ శర్మలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది

రోహిత్ శర్మలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది

"అప్పుడర్థమైంది నాకు రోహిత్ శర్మలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, ఇక్కడ కేవలం ఒక్క టాలెంట్ గురించే మాత్రమే మాట్లాడితే.. కోహ్లీ కంటే రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. అయితే టాలెంట్‌కి హార్డ్‌వర్క్‌ కలిపితే మాత్రం అందరూ కోహ్లీ వెనుకే" అని హర్భజన్ సింగ్ తెలిపాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య విశాఖ వేదికగా బుధవారం నుంచి రెండో వన్డే జరగనుంది.

తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం 246

తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం 246

తొలి వన్డేలో కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం 246. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

Story first published: Tuesday, October 23, 2018, 15:27 [IST]
Other articles published on Oct 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+