క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన ఆటగాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి సచిన్‌ను అభిమానిస్తూ పెరగానని తెలిపాడు. గోల్డెన్ మన్, భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్.. సచిన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
తన చిన్ననాటి హీరో సచిన్ అని చెప్పిన యువరాజ్ సింగ్.. భారత్‌లో ఉన్న 90 శాతం ఆటగాళ్లకు అతనే ఆరాధ్యా దైవమని పేర్కొన్నాడు. ఆటగాడిగానే కాకుండా సచిన్ గొప్ప మానవతావదని కొనియాడాడు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు.. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు సచిన్ తన మాటలతో మోటివేట్ చేసేవాడని గుర్తు చేసుకున్నాడు.

వెంటనే నీరజ్ చోప్రా.. సచిన్ తనను కూడా చాలా ఎంకరేజ్ చేశాడని చెప్పుకొచ్చాడు. కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్‌ను కలిసానని గుర్తు చేసుకున్న నీరజ్ చోప్రా.. ఆయన చెప్పిన మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకంగా అనిపించాయని చెప్పుకొచ్చాడు.
ఈ ఇద్దరూ తన గురించి మాట్లాడిన వీడియోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పిన సచిన్.. క్రీడల్లో వారిందించిన సహకారంపై చాలా గౌరవం ఉందని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత్ గెలిచిన 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించగా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్ తొలి బంగారు పతకం అందించిన ప్లేయర్‌గా నీరజ్ చోప్రా చరిత్రకెక్కాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన యువరాజ్ సింగ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూనే.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 2018లో యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.