ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌తో సచిన్ తనయుడు.. చొక్కా లేకుండా డిన్నర్.. ఫొటోలు వైరల్!

న్యూఢిల్లీ: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్‌తో ఉన్న అతని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్.. తాజాగా ఆమెతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ కెమెరాలు ఫోజులివ్వగా ఆ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు అర్జున్.. చొక్కా లేకుండా తన కండలు చూపిస్తుండగా.. వ్యాట్ మాత్రం ఓకే అన్నట్లు సైగలు చేస్తోంది.
ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి డానియల్ వ్యాట్.. అర్జున్‌ను బుట్టలో వేసుకుందా? అని ఒకరంటే.. అతను చాలా చిన్నపిల్లాడని మరొకరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతున్నారు.

సచిన్‌తో సాన్నిహిత్యం..
ఇంగ్లండ్ మహిళల జట్టు ఓపెనర్ అయిన డానియల్ వ్యాట్‌కు సచిన్ కుంటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గతంలో కూడా వారి కుటుంబ సభ్యులతో వ్యాట్ చనువుగా ఉంది. ముఖ్యంగా సచిన్, అర్జున్ ఇంగ్లండ్ వచ్చిన ప్రతీసారి తాను తప్పకుండా కలుస్తోంది. ఇంతకుముందు ఓసారి అర్జున్‌తో పరిచయం గురించి వ్యాట్ మాట్లాడింది. లార్డ్ క్రికెట్ మైదానంలో సచిన్, అర్జున్‌ను తొలిసారి కలిసానని చెప్పింది.

12 ఏళ్ల కిత్రం..
'సరిగ్గా గుర్తు లేదు 2009.. 2010 అనుకుంటా.. నేను తొలిసారి సచిన్, అతని తనయుడు అర్జున్‌ను లార్డ్స్ క్రికెట్ మైదానంలో కలిసాను. నేను అప్పుడు ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ గ్రూప్‌తో ఉన్నాను. వారిద్దరూ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. నేను వారి దగ్గరకు వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నా. అప్పుడు అర్జున్‌కు పదేళ్లనుకుంటా. అతను చాలా చిన్నగా ఉన్నాడు.
అప్పటి ఫొటోలు గూగుల్‌లో కూడా ఉంటాయి. ఆ రోజు నేను అర్జున్‌కు బౌలింగ్ చేసాను. అతను బాగా ఆడాడు. అప్పటి నుంచి సచిన్, అర్జున్‌తో సాన్నిహిత్యం పెరిగింది. ఎప్పుడూ లార్డ్స్ వచ్చినా కలిసేదాన్ని. నెట్స్‌కు వెళ్లి అర్జున్‌తో కొత్త బంతితో బౌలింగ్ చేయించుకునేవాడిని. అప్పటికి ఇప్పటికీ అర్జున్ బౌలింగ్‌లో వేగం పెరిగింది.'అని వ్యాట్ చెప్పుకొచ్చింది.

పాపం అర్జున్ టెండూల్కర్..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్జున్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు. తాజా సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శన కనబర్చడంతో అర్జున్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ ముంబై మేనేజ్‌మెంట్ మాత్రం అతను ఒక్క చాన్స్ ఇవ్వలేదు. ఇక రంజీ ట్రోఫీలోనూ ముంబై జట్టు నుంచి అర్జున్ ఉద్వాసనకు గురయ్యాడు. ప్రస్తుతం అతను కెరీర్ పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications