Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్క్వేర్ కట్స్ నుంచి హెయిర్ కట్ వరకు.. ఎలా ఉంది?

Sachin Tendulkar Shares Pictures Of His New Hairdo, Fans Pour In Love
Sachin Tendulkar Shares His New Haircut In Instagram

ముంబై: భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. దేశంలో జరిగే ప్రతీ ఘటనపై తనదైన శైలిలో స్పందించే సచిన్.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు క్రికెట్ పరిభాషను ఉపయోగించడంలోను దిట్ట. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎన్నో ట్వీట్‌లు చేసిన సచిన్.. తాజాగా తాను లాక్‌డౌన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నానో తెలియజేశాడు.



ఆదివారం స్వయంగా హెయిర్‌ కట్‌ చేసుకొని దానికి సంబంధించిన ఫొటోను అద్భుతమైన క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'స్క్వేర్‌కట్ షాట్స్ ఆడడం నుంచి.. నాకు నేను హెయిర్‌కట్‌ చేసుకోవడం వరకు.. విభిన్నమైన పనులను చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. నా న్యూ లుక్ ఎలా ఉంది'అని ఫ్యాన్స్‌ను సచిన్‌ ప్రశ్నించాడు. ఇటీవల టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అనుష్క శర్మ హెయిర్‌కట్‌ చేసిన విషయం తెలిసిందే.

2013లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్‌.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. క్రికెట్‌లో వంద అంతర్జాతీయ సెంచరీలతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఘనతను అందుకున్నాడు. తన ఆటతో దేశానికి పేరు తేవడమే కాకుండా ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇక కరోనా క్వారంటైన్ సమయాన్ని సచిన్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. ఇక కరోనా వైరస్ కట్టడికి తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. అలాగే ఓ స్వచ్చంద సంస్థతో కలిసి ఐదు వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించాడు.

Story first published: Monday, April 20, 2020, 11:12 [IST]
Other articles published on Apr 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+