కూతురు-కోడలితో క్రికెట్ ఆడిన సచిన్!(వీడియో)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్‌తో కలిసి సరాదాగా క్రికెట్ ఆడాడు. కుటుంబంతో కలిసి ప్రైవేట్ జెట్‌లో విదేశీ టూర్‌కు వెళ్లిన సచిన్.. ఈ ప్రయాణంలో భాగంగా తమ ప్రత్యేక విమానంలోనే సరదాగా క్రికెట్ ఆడాడు.
కోడలు సానియా ఛందోక్ బౌలింగ్ చేయగా.. కూతురు సారా టెండూల్కర్ సోఫాలో కూర్చొని ఫీల్డింగ్ చేసింది. సచిన్ బ్యాటింగ్ చేస్తూ.. దమ్ముంటే తనను ఔట్ చేయాలని సారా టెండూల్కర్ సవాల్ విసిరాడు. తాను బ్యాట్‌ను తలకిందులు చేస్తే తప్పా ఔట్ చేయాలేరని చెప్పాడు.
రివర్స్ బ్యాట్‌తో బ్యాటింగ్ చేసినప్పుడు సచిన్ ఇచ్చిన క్యాచ్‌ను సారా వదిలేసింది. ఆ వెంటనే వచ్చిన క్యాచ్‌ను మాత్రం పట్టుకుంది. ఈ వీడియోను సచిన్ టెండూల్కర్ 'ఎంత ఎత్తు ఎదిగినా.. మన ప్రవర్తన మారకూడదు.'అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఈ వీడియో ఆసాంతం సారా టెండూల్కర్ నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సచిన్ నిరాడంబరమైన స్వభావాన్ని, ఆటతో ఆయనకు ఉన్న జీవితకాల బంధాన్ని అభిమానులు ప్రశంసించారు. క్రికెట్ అనేది ఆయన జీవితంలో ఒక విడదీయరాని భాగమని, చివరికి ఒక ఫ్యామిలీ ట్రిప్ కూడా ఈ మాజీ భారత కెప్టెన్‌కు బ్యాట్ పట్టుకునే అవకాశంగా మారుతుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా ఛందోక్, సారా టెండూల్కర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అర్జున్‌తో పెళ్లికి ముందే ఈ ఇద్దరూ ఫ్రెండ్స్. సారా టెండూల్కర్ దగ్గరకు వచ్చే సమయంలోనే అర్జున్.. సానియాను బుట్టలో వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఇద్దరూ చాలా సీక్రెట్‌గా లవ్ చేసుకున్నారని, సారా టెండూల్కర్ కూడా సందేహం రాకుండా వ్యవహరించారని ప్రచారం జరిగింది. అర్జున్-సానియా ప్రేమ వ్యవహారం తెలిసి సచిన్ టెండూల్కర్‌తో పాటు అంజలి, సారా అంతా అవాక్కయ్యారని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అర్జున్.. ముంబై టీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

