సచిన్‌కు సారీ చెప్పిన ‘స్పార్టన్’కంపెనీ

న్యూఢిల్లీ: భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు ఆస్ట్రేలియాకు చెందిన బ్యాట్ల తయారీ కంపెనీ 'స్పార్టన్' క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ కంపెనీ, సచిన్‌ల మధ్య ఏడాది కాలంగా కొనసాగుతోన్న వివాదం ముగిసింది. ఒప్పంద ఉల్లంఘనకుగాను గురువారం కంపెనీ క్షమాపణలు తెలపడంతో సచిన్ ఈ వివాదాన్ని ముగించేందుకు అంగీకరించాడు. ఇచ్చిన మాట తప్పినందుకు మమ్మల్ని సచిన్ మన్నించాలని స్పార్టన్ డైరెక్టర్ లెస్ గాల్‌బ్రెత్ కోరాడు.
'స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని గౌరవించనందుకు సచిన్‌కు హృదయపూర్వక క్షమాపణలు. అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన సచిన్ తీరుకు మా కృతజ్ఞతలు'అని ఆయన తెలిపారు. 2016లో స్పార్టన్ కంపెనీకి సచిన్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. అయితే ఒప్పందం ప్రకారం రాయల్టీ, ఎండార్స్‌మెంట్ ఫీజులు చెల్లించడంలో స్పార్టన్ కంపెనీ విఫలమైంది.
దీంతో ఆ డీల్‌ను సచిన్ 2018లో రద్దు చేసుకున్నాడు. ఒప్పందం ముగిశాక కూడా అనుమతి లేకుండా సచిన్ ఫొటోలు, పేరు వాడుకుంటూ వ్యాపారం చేసింది. దీంతో న్యాయబద్ధంగా పోరాటం చేసిన సచిన్ గతేడాది జూన్‌లో ఆ కంపెనీపై 2 మిలియన్ డాలర్లు (రూ. 15.1 కోట్లు) దావా వేశాడు. దాంతో ఆ సంస్థ సచిన్‌కు క్షమాపణలు తెలియజేసింది.
Story first published: Friday, May 15, 2020, 11:47 [IST]
Other articles published on May 15, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications