సోషల్ డిస్టెన్స్ మరచి గిల్‌క్రిస్ట్‌ను గట్టిగా కౌగిలించుకునేందుకు సిద్దమయ్యా: సచిన్

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. ముఖ్యంగా 1998 కొకాకోలా షార్జా కప్‌లో వరుసగా చేసిన సెంచరీలు అతని కెరీర్‌కే హైలైట్. ఏప్రిల్ 22, 1998న అద్భుత సెంచరీతో ఫైనల్‌కు చేర్చిన మాస్టర్.. మరో మూడు రోజుల వ్యవధిలోనే తన పుట్టిన రోజునాడే మరో శతకంతో భారత్‌కు కొకాకోలా కప్ అందించాడు.
ఇక మైదానంలో చాలా ప్రశాంతంగా ఉండే సచిన్.. భావోద్వేగాలను అస్సలు కనపడనీయడు. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా.. మరెంతటీ ఒత్తిడి ఎదురైనా..ముఖంలో అదే ప్రశాంతత ఉంటుంది తప్ప, కోపం.. అసహనం వ్యక్తం చేయడు. అలాంటి సచిన్ షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని సచినే తాజాగా స్టార్ స్పోర్ట్స్ కనెక్టెడ్ షోలో వెల్లడించాడు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినా..
భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ షార్జా కప్ జరగ్గా.. ఒక్కో దేశం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్, న్యూజిలాండ్ చెరొక విజయమే సాధించడంతో రన్ రేట్ కీలకమైంది. దీంతో ఆసీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ భారత్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన భారత్ 31 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. అప్పుడు క్రీజులో ఉన్న సచిన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేశాడు. అయితే, మధ్యలో ఇసుక తుపాను రావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపి వేసి, స్కోర్‌ను సవరించారు. 46 ఓవర్లలో 276 పరుగుల టార్గెట్ విధించారు. అయితే, భారత్ 237 పరుగులు మాత్రమే చేసింది. అయినా, నెట్ రన్‌రేట్ కారణంగా ఫైనల్‌కు చేరంది.

రివైజ్ టార్గెట్‌లో నిరాశ చెందా..
అయితే ఈ మ్యాచ్‌లో రివైజ్ టార్గెట్ చూసి తన ఒకింత నిరాశకు గురయ్యానని మాస్టర్ బ్లాస్టర్ గుర్తు చేసుకున్నాడు. ‘ఇసుక తుపాను కారణంగా లక్ష్యాన్ని సవరించారు. అప్పుడంతా డ్రెస్సింగ్ రూమ్‌లో దీనిపైనే చర్చించాం. 284 పరుగుల లక్ష్యంలో నుంచి 8-9 పరుగులు మాత్రమే కుదించి, 46 ఓవర్లలో ఛేదించమన్నారు. ఆ నిర్ణయంతో నేను నిరాశ చెందా. ఎందుకంటే 50 ఓవర్లలో కోత పెట్టకుండా లక్ష్యాన్ని ఛేదించమంటారేమో అనుకున్నా. అనుకోకుండా నాలుగు ఓవర్లు కుదించి, 8-9 పరుగులు మాత్రమే తగ్గించారు. టాస్ సందర్భంగా మేము అనుకున్న అంచనాలన్నీ కూడా తారుమారు అయ్యాయి'అని సచిన్ చెప్పుకొచ్చారు.

తుపాను చూడటం అదే తొలిసారి..
ఇక ఆ రోజు వచ్చిన ఇసుక తుపాను గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇసుక తుపాను చూడటం అదే తొలిసారి. అక్కడున్న మొత్తాన్ని తీసుకెళ్లిపోతుందనుకున్నా. గిల్‌క్రిస్ట్ నాకు కుడివైపున వెనుక ఉన్నాడు. చాలా బలంగా తుపాను వచ్చింది. సామాజిక దూరాన్ని పూర్తిగా మర్చిపోయి, గిల్‌క్రిస్ట్‌ను గట్టిగా పట్టుకునేందుకు సిద్ధమాయ్యా. ఎందుకంటే గంటకు 80-90మైళ్ల వేగంతో తుపాను వచ్చింది. వెంటనే మైదానాన్ని వీడి వెళ్లాలని అంపైర్లు చెప్పారు.'' అని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఇక ఫైనల్లో 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ధోనీతో.. అసాధ్యమనుకున్న నా కల నిజమైంది: సంజూ శాంసన్