Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రహానే ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన.. కోహ్లీలా దూకుడు ప్రదర్శించలేడని పొరపాటు పడొద్దు'

Sachin Tendulkar says Ajinkya Rahane is cool but aggressive
India Vs Australia : Sachin Tendulkar Backs Stand-in Captain Ajinkya Rahane | Oneindia Telugu

ముంబై: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే నాయకత్వానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ మద్దతు పలికారు. విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో రహానే జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. రహానే ప్రశాంతంగా, స్థిరంగా కనిపించినంత మాత్రాన.. విరాట్ కోహ్లీలా దూకుడు ప్రదర్శించలేడని పొరపాటు పడొద్దని సూచించారు. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే విరాట్ ఇండియాకి వచ్చేశాడు. కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రహానే అందుకున్నాడు.

ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన:

ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన:

తాజాగా సచిన్‌ టెండూల్కర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'అజింక్య రహానే గతంలోనూ టీమిండియాను సమర్థంగా ముందుకు నడిపించాడు. అతడు ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన దూకుడుగా ఉండడని అనుకోవద్దు. ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా దూకుడును ప్రదర్శిస్తారు. ఉదాహరణకు చేటేశ్వర్ పుజారా ఎంతో ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. అతడి దేహభాష సైతం ఆటకు అనుగుణంగా ఉంటుంది. ఎంతో శ్రద్ధగా ఆడతాడు. అలాగని అతడెవరికీ తక్కువ కాదు' అని అన్నారు. రహానే నాయకత్వానికి సచిన్‌ పూర్తి మద్దతు పలికారు.

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా:

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా:

'పరిస్థితులకు స్పందించే గుణం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే అందరి లక్ష్యం ఒక్కటేనని హామీ ఇవ్వగలను. అక్కడికి చేరుకొనేందుకు ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారు. టీమిండియానూ అలాగే గెలిపిస్తారు. అంటే అజింక్య రహానేకు ఒక భిన్నమైన శైలి, వ్యూహం ఉంటాయి. ప్రణాళికలు ఎలా రూపొందించాలి? పిచ్‌ ఎలా ఉంటుంది? బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌లు ఎలా ఉండాలనేది జట్టు యాజమాన్యం ఇష్టం' అని సచిన్‌ టెండూల్కర్ పేర్కొన్నారు.

రెండు టెస్టుల్లోనూ విజయం:

రెండు టెస్టుల్లోనూ విజయం:

అజింక్య రహానే బౌలర్ల కెప్టెన్ అని సీనియర్ పేసర్‌ ఇషాంత్ ‌శర్మ కూడా పేర్కొన్నాడు. రహానే ప్రశాంతమైన ప్రవర్తన ఆస్ట్రేలియాతో మిగతా టెస్టుల్లో టీమిండియాను విజయవంతంగా నడిపిస్తుందన్నాడు. కోహ్లీ లేకున్నా.. రహానే అద్భుతంగా జట్టును ముందుకు సడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానే ఇప్పటివరకు రెండు టెస్టులకు కెప్టెన్సీ చేయగా.. రెండింట్లోనూ భారత్ విజయం సాధించింది.

మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్ట్:

మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్ట్:

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధికం. భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

India vs Australia: జడేజాకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌.. టీమిండియా సరికొత్త సాధన!!

Story first published: Friday, December 25, 2020, 9:25 [IST]
Other articles published on Dec 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+