Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను రివర్స్ స్వింగ్‌ మొనగాడు: సచిన్

Sachin Tendulkar’s huge praise for veteran pacer

ముంబై: ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రివర్స్ స్వింగ్‌ రాబట్డడంలో అతను అత్యద్భుతమైన బౌలరని కొనియాడాడు. తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్‌ లారాతో 100 ఎంబీ మొబైల్ యాప్‌లో మాట్లాడిన మాస్టర్ బ్లాస్టర్.. రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్‌పై స్పందించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జేమ్స్ అండర్సన్‌ కీలకం కానున్నాడని తెలిపాడు.

'అండర్సన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌ను తికమక పెడతాడు. నా అనుభవపూర్వకంగా చెబుతున్నా. బంతిని ఔట్‌స్వింగ్‌ వేస్తున్నట్లు చూపించి.. తీరా దాన్ని వదిలే సమయానికి దిశను మార్చేస్తాడు. దాంతో చాలా మంది బ్యాట్స్‌మన్‌ అతను బంతిని పట్టుకున్న విధానం గమనించి అప్పటికే ఔట్‌స్వింగ్‌లో బంతి పడితే ఆడడానికి సిద్ధమైపోతారు. కానీ ఆ బంతి బ్యాట్స్‌మన్‌కు దూరంగా వెళ్లి వికెట్‌ సమర్పించుకునేలా చేస్తుంది.

Sachin Tendulkar’s huge praise for veteran pacer

అతని బౌలింగ్‌లో నాకిదే కొత్తగా అనిపించింది. ఎవరూ అలా చేయలేదు. ఇప్పుడు స్టువర్ట్‌ బ్రాడ్‌ అలాగే బంతులేస్తున్నాడు.. కానీ, అండర్సన్‌ చాలా కాలం కిందటే దాన్ని ప్రయోగించాడు. అందుకే అతడిని అత్యద్భుతమైన బౌలర్‌గా పరిగణిస్తా. రివర్స్‌ స్వింగ్‌లో అతను అత్యుత్తమ పేసర్‌' అని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయింది. 57/1 ఓవర్ నైట్ స్కోర్‌తో శుక్రవారం మూడో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్‌కు షైహోప్, బ్రాత్ వైట్ శుభారంభాన్ని అందించారు. రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

ఇక క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని స్పిన్నర్ డామ్ బెస్ విడదీసాడు. షైహోప్(16)ను క్యాచ్‌ ఔట్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే బ్రాత్ వైట్ హాఫ్ సెంచరీ చేయగా.. స్టోక్స్ అతన్ని పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 46 ఓవర్లలో వెస్టిండీస్ 149/3 స్కోర్ చేసింది. క్రీజులో షమరత్ బ్రూక్స్(25), రోస్టన్ ఛేజ్(5) ఉన్నారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 6, గాబ్రియెల్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించారు.

Story first published: Friday, July 10, 2020, 17:50 [IST]
Other articles published on Jul 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+