న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar డైహార్డ్ ఫ్యాన్ సుధీర్‌ను చితక్కొట్టిన పోలీసులు!

Sachin Tendulkar’s die hard fan Sudhir Chaudhary physically assaulted by police

పాట్నా: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సునీల్ చౌదరీ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఒళ్లంతా భారత జెండా పెయింట్.. చాతిపై పెద్ద అక్షరాలతో సచిన్ టెండూల్కర్ అనే పేరు .. ఓ చేతిలో ఇండియన్ ఫ్లాగ్.. మరో చేతిలో శంఖం.. ఇది సుధీర్ చౌదరి అవతారం. భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ కనిపించే సుధీర్.. కరోనా కారణంగా ఇటీవల చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న సుధీర్ వర్మ విచిత్రక పరిస్థితుల్లో వార్తల్లో నిలిచాడు.

కజీన్ బ్రదర్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను పోలీసులు చితక్కొట్టారని సుధీర్ చౌదరి ఆరోపించాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. విచిత్రం ఏంటంటే సచిన్ అభిమానిగా సెలెబ్రిటీ హోదాలో ఏ పోలీస్ స్టేషన్‌ను అయితే ప్రారంభించాడో.. అదే స్టేషన్‌లో సుధీర్ దెబ్బలు తిన్నాడు. ల్యాండ్ వివాదంలో అరెస్ట్ అయిన కజిన్ బ్రదర్ కిషన్ కుమార్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సుధీర్.. వారి చేత దెబ్బలు తిన్నాడట.

ఈ ఘటన గురువారం బిహార్‌లోని ముజాఫ్ఫర్‌పుర్ జిల్లా పరిధిలోనే పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సుధీర్ డీసీపీ రామ్‌నరేశ్ పస్వాన్‌కు ఫిర్యాదు చేశాడని న్యూస్ 18 పేర్కొంది. పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

'కొన్నేళ్ల క్రితం సెలెబ్రిటీ హోదాలో ఏ పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ ప్రారంభించానో అదే పోలీస్ స్టేషన్‌లో నాకు అవమానం ఎదురైంది. పోలీసులు నా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ చేయిచేసుకున్నారు. నా పట్లనే పోలీసులు అలా ప్రవర్తిస్తే సామన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.'అని డీఎస్‌పీకి ఇచ్చి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సుధీర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సోదరుడిని కలవడం మినహా అక్కడేం జరగలేదని సమాచారం. అయితే సోదరుడి కోసం పోలీసులతో సుధీర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై డీఎస్పి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Story first published: Friday, January 21, 2022, 20:36 [IST]
Other articles published on Jan 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X