Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను వండిన చికెన్‌ను షేన్ వార్న్ తినలేకపోయాడు.. ఆ కారానికి తల్లడిల్లాడు: సచిన్

Sachin Tendulkar reveals Shane Warne once refused to finish a spicy meal cooked by him

ముంబై: తాను స్వయంగా వండిన చికెన్ కూరను ఆస్ట్రేలియా స్పిన్నర్ దిగ్గజం షేన్ వార్న్ తినలేకపోయాడని భారత్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. కారం తినలేక వార్న్ చాలా ఇబ్బంది పడ్డాడని, చివరకు తానే కిచెన్‌లోకి వెళ్లిన తనకు నచ్చిన ఆస్ట్రేలియాన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాడని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఇక షేన్ వార్న్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌కు వెకేషన్ కోసం వెళ్లిన వార్న్ విగత జీవిగా మారడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక మైదానంలో ఉప్పు-నిప్పుగా ఉండే సచిన్-వార్న్ ఔట్ ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులు. ఈ ఇద్దరి మధ్య పోరును అభిమానులు బాగా ఆస్వాదించేవారు. ఒకసారి సచిన్ పై చేయి సాధిస్తే.. మరోసారి వార్న్ ఆధిపత్యం చెలాయించేవాడు.

వార్న్ చికెన్ తినలేకపోయాడు..

వార్న్ చికెన్ తినలేకపోయాడు..

ఇక షేన్ వార్న్ అకాల మరణం తనను షాక్‌కు గురిచేసిందన్న సచిన్.. తనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఈ క్రమంలోనే 1998లో భారత పర్యటనకు వచ్చిన షేన్ వార్న్‌ను తన ఇంటికి ఆహ్వానించానని సచిన్ తెలిపాడు. 'షేన్ వార్న్.. మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా? నీకు ఇండియన్ ఫుడ్ ఇష్టమా?'అని వార్న్‌ను అడిగాను. అతను దానికి చాలా ఇష్టమని చెప్పాడు. నువ్వే వండాలని కోరాడు.ఇక నేను వండిన చికెన్‌ కరీలో నుంచి ఒక పీస్ తిన్న వార్న్ చాలా అసౌకర్యానికి గురయ్యాడు.

కారం తట్టుకోలేకపోయాడు..

కారం తట్టుకోలేకపోయాడు..

నా మేనేజర్‌ను సాయం చేయమని కోరాడు. దాంతో మా మేనేజర్ వార్న్ ఏం తినడం లేదనే విషయాన్ని చెప్పాడు. అప్పుడు నేను ఇతరులకు వడ్డిస్తున్నాను. షేన్ వార్న్ ప్లేట్‌లోని ఫుడ్‌ను చూసాక అతను కారం తినలేడనే విషయం నాకు అర్థం అయింది. నన్ను హట్ చేయవద్దనే ఉద్దేశంతో ఆ విషయం నాకు చెప్పకుండా నా మేనేజర్‌తో నసిగాడు. చివరకు అతనే కిచెన్‌లోకి వెళ్లి తనకు నచ్చిన ససేజర్, బీన్స్, పొటాటోస్ ఫ్రై చేసుకొని భోజనాన్ని పూర్తి చేశాడు.'అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

ఆ కారం నా వల్ల కాలేదు..

ఆ కారం నా వల్ల కాలేదు..

ఇక తనపై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన డాక్యుమెంటరీలో షేన్ వార్న్ ఈ ఘటన గురించి చెప్పాడు. సచిన్ వండించిన చికెట్ తింటానని భావించానని, కానీ కారం తట్టుకోలేక తినలేకపోయానన్నాడు. 'సచిన్, నేను మంచి ప్రత్యర్థులం, స్నేహితులం. మేం ఇండియాలో ఉంటే అది ఆస్ట్రేలియా vs భారత్ పోరు కంటే వార్న్ vs టెండూల్కర్ మధ్య పోరుగా అభిమానులు భావిస్తారు. ఒక సారి నేను సచిన్ వాళ్ల ఇంటికి డిన్నర్‌కు వెళ్లాను. సచిన్ వడ్డిచ్చిన చికెన్ కరీలోని ఓ పీస్ తిన్నాను. వెంటనే నా తల తిరిగినట్లు అయింది. ఆ కారాన్ని తట్టుకోలేకపోయాను. సచిన్, అతని ఫ్యామిలీ పట్ల ఉన్న గౌరవడంతో ఆ ఫుడ్‌ను తింటున్నట్లే నటిస్తూ పక్కన పెట్టేసాను.'అని వార్న్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 8, 2022, 10:42 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+