Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు సినిమా నాకు బాగా నచ్చింది: సచిన్ టెండూల్కర్

ఇటీవల విడుదలైన చిత్రాల్లో సౌతిండియాకు చెందిన 3BHK మూవీ తనకు బాగా నచ్చిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. తాజాగా రెడిట్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సచిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ యూజర్.. తరుచుగా సినిమాలు చూస్తారా? ఫేవరేట్ చిత్రాలు ఏంటి? అని అడిగాడు. టైమ్ దొరికితే సినిమాలు చూస్తానని చెప్పిన సచిన్.. ఈ మధ్యకాలంలో తనకు 3బీహెచ్‌కే, అత తంబైచ నాయ్ అనే చిత్రాలు బాగా నచ్చాయని తెలిపాడు. 3 బీహెచ్‌కే తమిళ మూవీ కాగా .. అత తంబైచ మాత్రం మరాఠీ మూవీ.

3 బీహెచ్‌కే తెలుగులో కూడా విడుదలైంది. ఓ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 3 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు పడ్డ కష్టాలను ఈ సినిమాలో చూపించారు. సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో అతనికి తండ్రిగా శరత్ కుమార్ నటించారు. ఈ మూవీ మిడిల్ క్లాస్ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చిన సచిన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగి.. కోటీశ్వరుడయ్యాడు. దాంతోనే ఈ సినిమాకు సచిన్ బాగా కనెక్ట్ అయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Sachin Tendulkar Reveals His Favorite telugu Movie

క్రికెట్ ఎంతో ఇచ్చిందని ఈ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. సచిన్ ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నానని మాస్టర్ బదులిచ్చాడు. అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం వార్తల గురించి అడగ్గా.. నిజమేనని సచిన్ బదులిచ్చాడు. 'అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అతను జీవితంలో తదుపరి అడుగు వేయడం చూడటానికి మేమంతా ఉత్సాహంగా ఉన్నాం.'అని తెలిపాడు. ప్రముఖ వ్యాపార వేత్త రవి ఘాయ్ మనవరాలు అయిన సానియా చందోక్‌తో అర్జున్‌కు నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.

Sachin Tendulkar Reveals His Favorite telugu Movie

సారా టెండూల్కర్‌కు సానియా చందోక్ అత్యంత క్లోజ్ ఫ్రెండ్. అక్క దగ్గరకు వచ్చే క్రమంలో సానియా చందోక్‌ను అర్జున్ ప్రేమలో పడేసినట్లు తెలుస్తోంది. సారా టెండూల్కర్‌కు అనుమానం రాకుండా ఈ ఇద్దరూ ప్రేమయాణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. వీరి ప్రేమ వ్యవహారం తెలిసి సారాతో పాటు సచిన్ కూడా ఆశ్చర్యపోయాడంట. ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే ఇరు కుటంబాలు నిశ్చితార్థం జరిపించినట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, August 26, 2025, 16:27 [IST]
Other articles published on Aug 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+