Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. వర్షంలో చిన్నపిల్లాడిలా సచిన్ ఆటలు!!

Sachin Tendulkar relives childhood memories as he enjoys Mumbai rains

ముంబై: అప్పుడే మొదలైన వర్షం అన్నా.. భారీ వర్షం అనంతరం పడే చిరుజల్లు అన్నా అందరూ ఇష్టపడుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఆటలు ఆడుతూ.. కేరింతలు కొడుతారు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా వర్షంలో చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేశారు. లిటిల్‌ మాస్టర్‌ బుధవారం ముంబైలోని తన ఇంటి ఆవరణలో వర్షపు చినుకుల్లో తడిసి ముద్దయ్యారు. ముంబైలో ఇటీవల జోరు వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న వర్షం కురిసిన వేళ సచిన్‌ కాసేపు వాన నీటిలో సేద తీరారు.

వర్షంలో చిన్నపిల్లాడిలా సచిన్

వర్షంలో చిన్నపిల్లాడిలా సచిన్

సచిన్ టెండూల్కర్ చిన్నపిల్లల్లాగే వర్షపు చినుకులను ఆస్వాదిస్తుంటే.. ఆయన ముద్దుల కూతురు సారా టెండూల్కర్ కెమెరాలో షూట్ చేశారు. వీడియోను సచిన్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. 'నా ఫెవరెట్‌ కెమెరావుమన్‌ సారా టెండూల్కర్‌. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను నేను ఆస్వాదించడం తను చిత్రీకరించింది. ఈ వర్షపు చినుకులు ఎప్పుడూ నా చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి. వాన చినుకుల్లో తడవడం ఆనందంగా ఉంది' అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

సచిన్‌లోని పిల్లాడు అలాగే ఉన్నాడు:

అదే వీడియోలో సారా టెండూల్కర్ మాట్లాడుతూ... తన తండ్రిలోని చిన్నపిల్లాడు ఇంకా అలాగే ఉన్నాడని పేర్కొన్నారు. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. థేన్‌, పాల్‌ఘర్‌, రాయిగడ్‌, రత్నగిరి, సిందుదర్గ్‌ ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఇక లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ఇంటికే పరిమితమైన సచిన్..‌ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అలాగే ఇంటి పనులు కూడా చేస్తున్నారు. వంట చేయడం, కుమారుడు అర్జున్​కు హెయిర్​కట్ చేయడం చేస్తూ సమయం గడుపుతున్నారు.

ఇంట్లోని పనులు చేస్తూ:

ఇంట్లోని పనులు చేస్తూ:

కరోనా కారణంగా సచిన్ ముద్దుల కూతురు సారా ఇంట్లోని పనులు చకచకా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీట్‌రూట్ కబాబ్​లు చేశారు. ఈ కబాబ్​లను తిన్న సచిన్.. సారాపై ప్రశంసల వర్షం కురిపించారు. బీట్‌రూట్ కబాబ్​లను సారా అద్భుతంగా చేసిందని ఆయన చెప్పారు. కబాబ్​లకు సంబందించిన పోటోలను సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 60 సెకన్లలోనే ప్లేట్​ను ఖాళీ చేశానంటూ చెప్పారు.

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించారు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశారు. 2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

ధోనీ విధేయతను ఎప్పటికీ మర్చిపోను.. నా కోసం ఆ యాత్ర రద్దు చేశాడు: కిర్​స్టన్

Story first published: Thursday, July 16, 2020, 16:05 [IST]
Other articles published on Jul 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+