టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడని కొనియాడని సచిన్.. తన ఆటతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాడు. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ మరింత సక్సెస్ సాధించాలని ఆకాంక్షించాడు. విరాట్ కోహ్లీ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగభరతమైన పోస్ట్‌తో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. గుండె నిండా సంతోషంతో తనకు నచ్చిన ఆట నుంచి తప్పుకుంటున్నానని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
కోహ్లీ రిటైర్మెంట్‌పై ఎక్స్‌వేదికగా స్పందించిన సచిన్.. ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ రోజు కోహ్లీ చేసిన పని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపాడు.
'కోహ్లీ.. నువ్వు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో నాకు ఓ అద్భుతమైన ఘటన గుర్తుకొచ్చింది. 12 ఏళ్ల క్రితం నా చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. నువ్వు మీ దివంగత తండ్రి ఇచ్చిన ఓ దారాన్ని నాకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నించావు. అది నీ వ్యక్తిగతమైనది కావడంతో నేను స్వీకరిచలేకపోయాను. అయితే ఆ చర్య నా హృదయాన్ని హత్తుకుంది. నా మనసులో చిరస్థాయిగా ఉండిపోయింది.

అలాంటి దారాన్ని నేను ఇవ్వలేను. దయచేసి నా అభిమానాన్ని, అభినందనలను స్వీకరించండి. నీ ఆటతో ఎంతో యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చావు. పరుగుల కంటే ఎక్కువే ఈ భారత క్రికెట్‌కు అందించావు. నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు.'అని సచిన్ ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. మరో 770 పరుగులు చేసుంటే కోహ్లీ 10వేల పరుగుల క్లబ్‌లో చేరేవాడు.