మైదానంలోకి దూసుకొచ్చి చేయి చేసుకున్న పాక్ అభిమాని: సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శత్రు దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 37 ఏళ్ల క్రితం (1989 నవంబర్ 15) 16 ఏళ్ల పసి వయసులో కరాచీ వేదికగా సచిన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. క్రిష్ శ్రీకాంత్ సారథ్యంలో సచిన్ తొలి మ్యాచ్ ఆడగా.. అది కపిల్ దేవ్‌కు 100వ టెస్ట్ కావడం మరో విశేషం.
అయితే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సచిన్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో జరిగిన అనూహ్య ఘటనతో తాను ఎంతగానో భయపడిపోయానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ ఘటనను పాకిస్థాన్ మీడియా కప్పిపుచ్చిన విధానం తమను విస్మయానికి గురి చేసిందని వెల్లడించాడు.

తొలి రోజే సచిన్‌కు వింత అనుభవం..
'నా అరంగేట్ర మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టేందుకు నాకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌తోనే నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అది కపిల్ దేవ్ 100వ మ్యాచ్ కూడా. అప్పటి వరకు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
నా అరంగేట్రం తొలి రోజే వింత అనుభవం ఎదురైంది. లంచ్ బ్రేక్ తర్వాత సల్వార్ కమీజు ధరించి గడ్డాలున్న వ్యక్తి మైదానంలోకి ప్రవేశించి కపిల్ దేవ్ దగ్గరకు దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌లో ఎందుకు ఆడుతున్నారు? అంటూ కపిల్ దేవ్‌ను తిట్టాడు. ఆ తర్వాత మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పేస్ బౌలర్ మనోజ్ ప్రభాకర్ దగ్గరకు వెళ్లాడు. అతనిపై కూడా నోరు పారేసుకున్నాడు.
మా కెప్టెన్‌ను కొట్టాడు..
అనంతరం మా కెప్టెన్ శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి ఏకంగా అతనిపై చేయి చేసుకున్నాడు. అప్పట్లో శ్రీకాంత్ టీషర్ట్స్‌కు బదులు గుండీలు ఉండే చొక్కా ధరించేవారు. దాంతో ఆయన చొక్కా చినిగిపోయింది. ఆ తర్వాత నా దగ్గరికే వస్తాడని నేను భయపడ్డాను. అతను నావైపు వస్తే డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగెత్తి దాక్కోవాలని అనుకున్నాను. మైదానంలో ఇంత జరుగుతున్నా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించలేదు. చివరకు అతన్ని బయటకు లాక్కెళ్లడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను.
పాక్ మీడియా కవరింగ్ చూసి విస్తుపోయాం..
ఇది ఘోరమైన భద్రతా లోపం. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ మరుసటి రోజు పాకిస్థాన్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి మేం విస్తుపోయాం. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కపిల్ దేవ్‌ను అభినందించడానికి సదరు అభిమాని మైదానంలోకి ప్రవేశించాడని పాకిస్థాన్ మీడియా కవర్ చేయడం చూసి విస్మయానికి గురయ్యాం. శ్రీకాంత్ చొక్కా చిరిగిన సంగతిని పాక్ మీడియా ఎక్కడా ప్రస్తావించలేదు. తన బౌలింగ్‌ను అడ్డుకోవద్దని, ఆటను కొనసాగనివ్వాలని సదరు అభిమానితో అన్నట్లు కపిల్ దేవ్ తర్వాత నాకు చెప్పాడు. 'అని సచిన్ టెండూల్కర్ సంచలన విషయాలను బయటపెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

