అప్పుడు కోహ్లీ విలువైన బహుమతి ఇచ్చాడు : సచిన్ టెండూల్కర్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన రోజు యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ తనకు విలువైన బహుమతి ఇచ్చాడని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. విరాట్‌కు అతని తండ్రి ఇచ్చిన ఆ కానుకను తనకు ఇచ్చాడని, అయితే దాన్ని మళ్లీ అతనికే ఇచ్చానని సచిన్ తెలిపాడు. 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. 2013లో వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అది యావత్ క్రికెట్ ప్రేమికులతో పాటు సచిన్‌కు కూడా అత్యంత బాధాకరమైన రోజుగా మిగిలింది. ఆ రోజు విరాట్ కోహ్లీ బహుమతి ఇవ్వడం తన జీవితంలో ఓ మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నాడు.
తాజాగా ఓ అమెరికన్ జర్నలిస్ట్‌తో యూట్యూబ్‌లో మాట్లాడిన క్రికెట్ దిగ్గజం నాటి విశేషాల్ని పంచుకున్నాడు. 'ఆ రోజు నేను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని టవల్‌తో కళ్లను తుడుచుకుంటూ కూర్చున్నా. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అప్పుడే కోహ్లీ నా వద్దకు వచ్చి ఒక పవిత్రమైన దారం ఇచ్చాడు. అది కోహ్లీకి వాళ్ల నాన్న ఇచ్చాడట. అయితే, దాన్నే నాకు ఎందుకు ఇచ్చాడో కూడా వివరించాడు. 'మన దేశంలో చాలా మంది మణికట్టు వద్ద ఇలాంటి పవిత్రమైన దారాలు కట్టుకుంటారు.

ఎంతో మందికి స్పూర్తి నింపారని..
అలానే నాకూ ఈ దారాన్ని మా నాన్న ఇచ్చాడు. దాన్ని నేను ఎప్పుడూ నా బ్యాగ్‌లోనే పెట్టుకుంటాను. నా వద్ద ఉన్న అత్యంత విలువైనది ఇదేనని భావిస్తా. అందుకే దీన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇంతకుమించింది నాతో ఏదీ లేదు. మీరు నాతో పాటు ఎంతో మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆ విషయాన్ని మీకు తెలియజేసేందుకే ఈ దారం ఇవ్వాలనుకుంటున్నా' అని కోహ్లీ నాతో వివరించాడు'' అని సచిన్ గుర్తుచేసుకున్నాడు.

చివరి క్షణం వరకు..
'ఇక నేను ఆ దారాన్ని కొద్దిసేపు నాతో పెట్టుకొని తిరిగి కోహ్లీకే ఇచ్చాను. అదెంతో విలువైనదని.. దాన్ని అతని వద్దే పెట్టుకోమని, వేరే ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పాను. అది మీ నాన్న ఇచ్చిన జ్ఞాపకం. నీ చివరి క్షణాల వరకూ నీతోనే ఉంచుకో' అని కోహ్లీతో చెప్పినట్లు సచిన్ వివరించాడు. అదొక భావోద్వేగభరితమైన సంఘటన అని.. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అని సచిన్ చెప్పుకొచ్చాడు.

దొంగచాటున అర్జున్ ఆటను చూస్తా..
తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆటను దొంగచాటున చూస్తానని సచిన్ తెలిపాడు. ''అర్జున్ ఆట మీద దృష్టి పెట్టాలి. నేను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా నన్ను ఎవరైనా చూసిన నాకు నచ్చేది కాదు. నేను వెళ్లి అర్జున్ ఆటను చూసినా అతనికి తెలియకుండా ఎక్కడో దాక్కుంటాను. నేను ఉన్నానని అతనికి తెలియనవ్వను. అర్జున్‌కే కాదు ఎవరికీ తెలియనివ్వను. అర్జున్ కోచ్ అయినా, ఇంకేవరైనా సరే వారి కంటపడను. అలా అతనికి తెలియకుండానే అతని ఆటను చూస్తాను "అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications