Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

7 ఇన్నింగ్స్‌ల్లో 752 పరుగులు.. ఆశ మాషి కాదు: సచిన్ టెండూల్కర్

టీమిండియా వెటరన్ బ్యాటరన్ కరుణ్ నాయర్‌పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు నమోదు చేయడం ఆశ మాషి వ్యవహారం కాదని .. ఎంతో కఠోర శ్రమ, అంకితభావం ఉంటే తప్పా ఈ గణంకాలను నమోదు చేయలేమని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇలానే ముందుకు సాగాలని సచిన్ ఆక్షాంక్షించాడు.

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ‌లో కరుణ్ నాయర్ సంచలన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విదర్భ జట్టుకు సారథ్యం వహిస్తున్న కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్‌లతో మొత్తం 752 పరుగులు చేశాడు.

Sachin Tendulkar praises Karun Nair over his performance in the Vijay Hazare Trophy

75.2 సగటుతో ఐదు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను ఒకే ఒక్కసారి మాత్రమే ఔటవ్వడం విశేషం. ఈ ప్రదర్శన నేపథ్యంలో కరుణ్ నాయర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత వన్డే జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లు కరుణ్ నాయర్‌కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. తాజాగా సచిన్ అతన్ని ఎక్స్‌వేదికగా అభినందించాడు.

సరిగ్గా ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించే ముందే సచిన్.. కరుణ్ నాయర్‌ను కొనియాడుతూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

'కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలతో 752 పరుగులు చేయడం అసాధారణం కరుణ్ నాయర్. ఇలాంటి గణంకాలు కేవలం ఒక్క రోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావంతో పాటు ఇష్టం ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటి ప్రదర్శనలు సాధ్యమవుతాయి. ఇలానే ధైర్యంగా ముందుకు సాగుతూ.. ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకో..'అని ఎక్స్ వేదికగా సచిన్ పేర్కొన్నాడు.

మరికొద్ది సేపట్లోనే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైలోని వాంఖడే మైదానంలో సమావేశమయ్యారు. మరికాసేపట్లోనే మీడియా ముందుకు వచ్చి జట్టును వెల్లడించనున్నారు.

Story first published: Saturday, January 18, 2025, 14:49 [IST]
Other articles published on Jan 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+