నా కెరీర్‌లో ఆ మూడు ఇన్నింగ్స్‌లను ఇప్పటికీ ఆస్వాదిస్తా: సచిన్

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాడు. తనదైన ఆటతో క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా తనే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు చేశాడు. మరెన్నో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు.
ఈ తరం ఆటగాళ్లకు సచిన్ సాధించిన మైలురాళ్లను చేరుకోవడం కష్టమే. ఇన్ని ఘనతలు అందుకున్న సచిన్ మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఏంచుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ మాస్టర్ ఏ మాత్రం సంకోచించకుండా తన మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఏంటో చెప్పాడు.

ఆ మూడు ది బెస్ట్..
'జీవితంలో లెక్కలేనన్ని రికార్డులు ఎన్నో సాధించా.. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో అన్నీ అత్యుత్తమే అనిపిస్తుంది. అందులో నుంచి ది బెస్ట్ ఏంచుకోమంటే మాత్రం ఆ మూడు ఇన్నింగ్స్‌ల గురించే ప్రస్తావిస్తా. మొదటి రెండు ఒకే సిరీస్‌లో వచ్చినవి. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీ సాధించి జట్టును ఫైనల్ చేర్చాను. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీతో కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించడం మరుపురాని జ్ఞాపకం.

సెంచరీ చేయకున్నా..
ఆ తర్వాత మరో ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే 2003 ప్రపంచకప్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్‌ను ఎప్పటికి మరిచిపోను. చిరకాల ప్రత్యర్థిపై శివరాత్రి రోజున ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు వీలున్నా.. ఈ మూడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటా.' అని చెప్పుకొచ్చాడు. ఇక షార్జా వేదికగా ఆడిన సచిన్ ఇన్నింగ్స్‌లను ఎడారిలా మాస్టర్ తుఫాన్‌గా అభివర్ణిస్తారు.

మైమరిపించే ఇన్నింగ్స్‌లు
ఇవే కాకుండా సచిన్ కెరీర్‌లో మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. 1992 కెరీర్ ప్రారంభంలో ఆసీస్‌పై పెర్త్ వేదికగా 114 పరుగులు చేయడం హైలెట్‌గా చెప్పవచ్చు. అప్పటివరకు సాధారణ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సచిన్‌కు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే ధైర్యం కలిగించింది. అలాగే 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 108 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోరు. ఉగ్రదాడి తర్వాత దేశకోసం కసిగా ఆడిన ఇన్నింగ్స్ అది. అందుకే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని సచిన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. 1999 ప్రపంచకప్.. కెన్యాపై 140 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత సచిన్ జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణవార్తను తెలుసుకున్న సచిన్ ఆ బాధను దిగమింగుకొని పాకిస్తాన్‌పై చేసిన 136 పరుగుల ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications